'సినిమాలో నువ్వు విలన్.. రియాలిటీలో నేనే విలన్'.. చంపేస్తామని బాబీకి స్నేహితుల వార్నింగ్‌

Friends Who Threatened To Kill Bobby Simha - Sakshi

వాల్తేరు వీరయ్య సినిమాలో సాల్మన్‌సీజర్‌గా చిరంజీవితో పోటీపడి నటించిన బాబీ సింహాకు హత్య బెదిరింపులు వచ్చాయి. వాస్తవానికి అతను  తెలుగు వాసి, కృష్ణా జిల్లా దివిసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి కానీ ఆయన తమళనాట సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇదిలా ఉండగా  కొడైకెనాల్‌లో తాను నిర్మించాలనుకుంటున్న ఇంటి నిర్మాణ కాంట్రాక్టర్లే బాబీ సింహాను  చంపేస్తామని బెదిరించారు. ఆ కాంట్రాక్టర్లు కూడా బాబీ స్నేహితులే కావడం గమనార్హం. కొడైకెనాల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

అనంతరం బాబీ సింహా మాట్లాడుతూ.. 'కొడైకెనాల్‌లో నేను ఇల్లు నిర్మించాలని అనుకున్నాను.. కానీ బిల్డింగ్ కాంట్రాక్టర్లు నాసిరకం పద్ధతిలో ఇల్లు నిర్మిస్తున్నారు. తమిళనాట రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న వ్యక్తి ఉసేన్‌.. అతను పరిచయం చేసిన బిల్డింగ్‌ కాంట్రాక్టర్‌ జమీర్‌తో నటుడు బాబీ సింహా తన ఇంటి నిర్మాణం కోసం కోటి 30 లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందుకు సంబంధించిన మొత్తం డబ్బును ఉసేన్‌, జమీర్‌లు తీసుకుని అదనంగా రూ. 40 లక్షలు కావాలని ఒత్తిడి చేసి తీసుకున్నారు.

(ఇదీ చదవండి: జైలర్‌ సినిమాను తిరస్కరించిన టాలీవుడ్‌ స్టార్‌ హీరో ఎవరో తెలుసా?)

అయినా ఇంటి పని పూర్తి అవ్వలేదు. దీంతో మేము కొడైకెనాల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, అతనికి రాజకీయ నేపథ్యం కారణంగా పోలీసులు చర్యలు తీసుకోలేదు. దీంతో మేము కోర్టుకు వెళ్లి కేసు వేశాము.' అని బాబీ తెలిపాడు. కానీ ఆ కాంట్రాక్టర్లే తిరిగి బాబీ సింహాపై కేసు పెట్టారు. తమను బాబీ బెదిరించారని కాంట్రాక్టర్లు అయిన ఉసేన్, జమీర్ ఇచ్చిన తప్పుడు ఫిర్యాదును పోలీసులు స్వీకరించి కేసు నమోదు చేశారని ఆయన తెలుపుతున్నాడు.

తాము మొదట ఫిర్యాదు చేసినప్పుడు పోలీసు శాఖ వారు కేసు తీసుకోలేదు. దీంతో కోర్టుకు వెళ్లి పోలీసుల తీరు గురించి వివరించామని బాబీ తరపున ఉన్న లాయర్‌ తెలిపారు. దీంతో కోర్టు జోక్యం చేసుకోవడంతో  సుమారు 10 రోజుల తర్వాత తమ ఫిర్యాదును వెంటనే స్వీకరించారని ఆయన తెలిపారు. ప్రస్తుతం 58 లక్షల 50 వేల వరకు మాత్రమే వారు ఇంటి నిర్మాణం కోసం ఖర్చు చేశారు. పూర్తి నాసిరకంగా ఇంటిని నిర్మించారు. దీంతో తాము  సుమారు 1 కోటి 11 లక్షల 50 రూపాయలు మోసపోయామని నటుడు బాబి సింహా తరపు న్యాయవాది తెలిపారు.

తాము మోసపోయిన డబ్బును వారి నుంచి తిరిగి ఇప్పించాలని కోర్టును కోరారు. ఇంత జరుగుతున్నా వారు బాబీని చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆయన చెప్పారు 'సినిమాలో మీరు విలన్‌ కావచ్చు కానీ మేం నిజమైన విలన్‌లమే' అంటూ నటుడు బాబీ సింహాను ఉసేన్ బెదిరించాడని, వేలచ్చేరి శాసనసభ సభ్యుడు అసన్ మౌలానా కనుసన్నల్లోనే ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top