మలయాళ డెబ్యూ కోసం కసరత్తులు చేస్తోన్న ఈషా

Eesha Rebba Learning Archery For Malayalam Debut - Sakshi

తెలుగు బ్యూటీ అయిన ఈషా రెబ్బకు సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ చాలానే ఉంది.. చేసింది కొన్ని సినిమాలే అయినా యూత్‌లో ఈ అమ్మడికి మంచి క్రేజ్‌ ఉంది. తనకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు తన సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తూ ఫాన్స్‌ను ఫిదా చేస్తోంది ఈ భామ. ఇటీవలె బందిపోటు, అమీ తుమీ, ఆ, రాగల 24 గంటల్లో వంటి మంచి సినిమాల్లో నటించినా ఈ భామకు ఇంతవరకు సరైన బ్రేక్ రాలేదు. తెలుగమ్మాయి అయిన ఈషాకు ఇక్కడ సరైన అవకాశాలు రాకపోయినా మలయాళ పరిశ్రమ నుంచి పిలుపు వచ్చింది. కుంచాకో బోబన్ హీరోగా నటించనున్న ఓట్టు సినిమాలో ఈషాకు ఛాన్స్‌ వచ్చిన సంగతి తెలిసిందే.


ఫెల్లి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో అరవింద్ స్వామి ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. ఒకేసారి తమిళ, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్‌ ప్రారంభం కావాల్సి ఉండగా, కరోనా కారణంగా బ్రేక్‌ పడింది. దీంతో ఈ గ్యాప్‌లో తన పాత్ర కోసం కసరత్తులు చేస్తోంది ఈ బ్యూటీ. ఇందుకోసం రైఫిల్ షూటింగ్, బాక్సింగ్‌లో ట్రైనింగ్‌ తీసుకుంటుంది. ఒకసారి షూటింగ్‌ స్టార్ట్‌ చేసిన తర్వాత లొకేషన్స్‌లో రోజువారీగా మలయాళ భాషపై పట్టు సాధిస్తాననే నమ్మకం ఉందంటోంది ఈషా. మొత్తానికి తెలుగమ్మాయిగా టాలీవుడ్‌లో అవకాశాలు పెద్దగా రాకపోయినా మలయాళం, తమిళ చిత్ర పరిశ్రమల్లో నుంచి ఈ అమ్మడికి అవకాశాలు రావడం విశేషం. ఇక ఈషా రెబ్బా ప్రస్తుతం అఖిల్‌ హీరోగా వస్తోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’  సినిమాలోనూ నటిస్తుంది. 

చదవండి : సూపర్‌ చాన్స్‌ కొట్టేసిన ఈషా రెబ్బా

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top