డైరెక్టర్‌ బాబీ చేతుల మీదుగా ‘లాభం’ ఫస్ట్‌లుక్‌

Director Bobby Release Vijay Sethupathi Laabam First Look - Sakshi

విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్‌లు హీరోహీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం ‘లాభం’. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను ప్రముఖ హిట్ చిత్రాల దర్శకుడు బాబీ చేతుల మీదుగా విడుదల చేశారు. ఆయనతో పాటు ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవి, బత్తులలు ఈ ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ చిత్రం సెప్టెంబరు 9న వినాయక చవితి సందర్భంగా తమిళంతో పాటు తెలుగులోనూ ఏక కాలంలో థియేటర్లలో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో లాభం ఫస్ట్‌లుక్‌ను మేకర్స్‌ విడుదల చేశారు.

చదవండి: ఆకట్టుకుంటున్న ‘అనబెల్‌..సేతుపతి’ ట్రైలర్‌

విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ మూవీ రెండు భాషల్లో విడుదల కావడం విశేషం. ఇందులో జగపతిబాబు విలన్ పాత్రలో నటిస్తుండగా, సాయి ధన్సిక ఓ కీలకమైన కీలక పాత్ర పోషించింది. ఎస్‌పీ జననాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ పతాకంపై నిర్మాత బత్తుల సత్యనారాయణ(వైజాగ్ సతీష్) నిర్మించారు. ఇందులో విజయ్ సేతుపతి రైతు సమస్యలపై పోరాడే యువకునిగా కనిపించనున్నాడు.ఈ సందర్భంగా దర్శకుడు బాబీ మాట్లాడుతూ.. ‘విజయ్ సేతుపతి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆయన నటించిన చిత్రాలు ఇప్పుడు తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాధించుకుంటున్నాయి. ఇటీవల తెలుగులో నేరుగా నటించిన  సైరా, ఉప్పెన చిత్రాలలో ఆయన పాత్రలకు మంచి అప్లాజ్ వచ్చింది.

చదవండి: Varudu Kaavalenu : ‘వరుడు కావలెను’ టీజర్‌ వచ్చేసింది

లాభం చిత్రంతోనూ ఆయన తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తారనే నమ్మకం ఉంది. ఇందులో అతని పాత్ర తన గత చిత్రాల్లానే చాలా వైవిధ్యంగా వుంటుందని అనుకుంటున్నా. ఫస్ట్ లుక్ చూస్తుంటే.. విజయ్ సేతుపతి లుక్ చాలా యూనిక్‌గా కనిపిస్తోంది. ఇందులో రైతుల సమస్యలపై పోరాడే యువకుని పాత్రలో విజయ్ సేతుపతి  ప్రేక్షకుల్ని అలరిస్తారని నమ్మకం ఉంది. ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న నిర్మాతలకు అభినందనలు. ఈ చిత్రం విజయం సాధించి మంచి లాభాలు తెచ్చిపెట్టాలని ఆశిస్తున్నా. ఈ చిత్రం వినాయక చవితి సందర్భంగా విడుదలవుతోంది కాబట్టి దేవుడి ఆశీస్సులు కూడా ఈ చిత్రానికి, నిర్మాతలకు పుష్కలంగా ఉండాలని కోరుకుంటున్న’ అని అన్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top