దురంధర్‌-2 మరో రికార్డ్.. కేవలం 11 రోజుల్లోనే బ్రేక్..! | Dhurandhar The Revenge beats first film Dhurandhar lifetime collections | Sakshi
Sakshi News home page

Dhurandhar The Revenge: దురంధర్‌ను బీట్‌ చేసిన సీక్వెల్.. ఎన్ని కోట్లంటే?

Mar 30 2026 9:14 AM | Updated on Mar 30 2026 10:31 AM

Dhurandhar The Revenge beats first film Dhurandhar lifetime collections

బాలీవుడ్ మూవీ దురంధర్‌-2 బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఇప్పటికే పలు చిత్రాల రికార్డులు బద్దలు కొట్టిన ఈ మూవీ వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. మార్చి 19న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం 11 రోజుల్లోనే మరో రికార్డ్ క్రియేట్ చేసింది. గతేడాది రిలీజైన దురంధర్‌ ఆల్‌ టైమ్‌ వసూళ్లను అధిగమించింది.

ఇప్పటి వరకు దురంధర్-2 ప్రపంచవ్యాప్తంగా రూ. 1,363.15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇండియావ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.1013.15 కోట్లు రాగా.. ఓవర్‌సీస్‌లో రూ.350 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఓవరాల్‌గా నెట్ వసూళ్ల పరంగా చూస్తే రూ. 847.87 కోట్లు వసూలు చేసింది. గతేడాది డిసెంబర్ 5, 2025న విడుదలైన  'ధురందర్' ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ. 1,307.35 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు మనదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో భారతీయ చిత్రంగా 'ధురందర్: ది రివెంజ్' నిలిచింది. 

దీనికంటే ముందు ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ (2016) రూ. 2,070 కోట్లతో జాబితాలో అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత ప్రభాస్ బాహుబలి- 2 (2017) రూ. 1,788 కోట్లతో ఉంది.  అల్లు అర్జున్ పుష్ప- 2 (2024) రూ. 1,742 కోట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది.కాగా.. రణవీర్ సింగ్ హీరోగా నటించిన  స్పై యాక్షన్ థ్రిల్లర్స్‌ దురంధర్‌ చిత్రాలకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీస్‌లో సారా అర్జున్‌ హీరోయిన్‌గా మెప్పించారు.  ఈ చిత్రంలో సంజయ్ దత్, రాకేష్ బేడీ, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్ కీలక పాత్రల్లో నటించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement