ధురంధర్‌ నటుడికి రూ.1 కోటి? అసలు నిజమిదే! | Dhurandhar Actor Vivek Sinha Clarifies About Rs 1 cr Remuneration | Sakshi
Sakshi News home page

రూ.1 కోటి పారితోషికం? ఎప్పుడో ఖర్చయిందన్న ధురంధర్‌ నటుడు!

Apr 11 2026 3:22 PM | Updated on Apr 11 2026 3:31 PM

Dhurandhar Actor Vivek Sinha Clarifies About Rs 1 cr Remuneration

గత ఐదు నెలలుగా 'ధురంధర్‌' సినిమా పేరు మారుమోగిపోతోంది. రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా నటించిన ఈ చిత్రం ఫస్ట్‌ పార్ట్‌ బ్లాక్‌బస్టర్‌ కాగా రెండో భాగం అంతకు మించిన ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వరద పారిస్తోంది. చిన్న, పెద్ద తేడా లేకుండా ఈ చిత్రంలో నటించిన ఆర్టిస్టులందరికీ మంచి గుర్తింపు లభించింది.

రూ.1 కోటి రెమ్యునరేషన్‌
ఈ క్రమంలో 'ధురంధర్‌'లో హైజాకర్‌ జహూర్‌ మిస్త్రీగా యాక్ట్‌ చేసిన నటుడు వివేక్‌ సిన్హ గురించి ఓ వార్త వైరలవుతోంది. అతడు ఈ చిత్రానికిగానూ ఏకంగా రూ.1 కోటి పారితోషికం తీసుకున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్స్‌పై తాజాగా వివేక్‌ సిన్హ స్పందించాడు. 'తమ్ముళ్లూ.. నాకు రూ.60 లక్షలు, రూ.80 లక్షలు, ఏకంగా రూ.1 కోటి ఇచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు. ఒట్టేసి చెప్తున్నా, నాకంత డబ్బు ఇవ్వలేదు. అనవసరంగా ఏదేదో ప్రచారం చేయకండి.

ఎప్పుడో ఖర్చయింది
అలా అని నాకు మొత్తానికే డబ్బు ఇవ్వలేదని కాదు. నేను అనుకున్నంత పారితోషికం ఇచ్చారు. కానీ మీరనుకునేంత కాదు. నాకు ఇచ్చినదంతా ఎప్పుడో ఖర్చు పెట్టేశాను కూడా! నేను ముంబైలో ఉంటాను కాబట్టి ఖర్చులు కూడా ఎక్కువే.. కాబట్టి ఎవరికీ సాయం చేసే పరిస్థితిలో నేను లేను. నాకు ఇలాగే మంచి అవకాశాలు రావాలని కోరుకోండి. అప్పుడు నేను బాగా సంపాదించగలను.. మీకు తిరిగి సాయం చేయగలను' అని వివేక్‌ సిన్హ తెలిపాడు.

 

చదవండి: సబ్‌స్క్రిప్షన్‌ తీసుకుంటే బూతు కంటెంట్‌? క్లారిటీ ఇచ్చిన నటి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement