సాక్షి, చెన్నై: తమిళనాట మరో నటుడు త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నట్టుగా సంకేతాలు జోరందుకున్నాయి. నటుడు ధనుష్ కొంతకాలంగా సేవా కార్యక్రమాల ద్వారా అభిమానులను ఉత్సాహపరుస్తు న్నారు. తాజాగా ఎన్నికల కమిషన్ వద్ద పార్టీ పేరును రిజిస్టర్ చేయించినట్టుగా తమిళ నాట చర్చ జోరందుకుంది. తమిళగ ఎళుచ్చి కళగం(తమిళ చైతన్యం) పేరిట ఈ పార్టీ పేరును ఎన్నికల కమిషన్ వద్ద నమోదుకు పంపించిన సమాచారంతో ఆయన అభిమా నులు ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీ వల ధనుష్ చేస్తున్న కార్యక్రమాలు, అభిమా నులను ఉద్దేశించి చేసిన ప్రసంగాలు, సేవా కార్యక్రమాలు ఆయన రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలకు బలం చేకూర్చాయి. ఈ పరిస్థితుల్లో తమిళనాట తాజాగా జరుగు తున్న ఉప ఎన్నికల ఫలితాల తదుపరి ధనుష్ కార్యాచరణ వేగవంతం కానున్నట్టు ఆయన అభిమాన సంఘాలు పేర్కొంటు న్నాయి. ఈ నెలాఖరులో రాజకీయ ప్రకటన అంటూ పార్టీ పేరును ప్రస్తావిస్తూ సామాజిక మాధ్యమాల్లో చర్చలతో హాట్ టాపిక్‌గా మారుస్తున్నాయి. దీంతో తమిళనాట ఆసక్తికర చర్చ ఊపందుకుంది.


