బంతితో వెళ్లిపోయిన రంగా..ఊరు చేరుకున్న రంగా భార్య

Devatha Serial : Adihya Feels Guilty For Satyas Helpless Situation - Sakshi

సత్యని నందా ఎక్కడికి తీసుకెళ్లాడో ఆదిత్య తెలుసుకుంటాడు. మరోవైపు బంతితో కలిసి రంగా వెళ్లిపోయడన్న విషయం తెలిసి రంగా భార్య ఊరు వచ్చి దేవుడమ్మపై నిందలు వేస్తుంది.. ఇలా దేవత సీరియల్‌ నేడు (మే7న)227వ ఎపిసోడ్‌లోకి ఎంటర్‌ అయిపోయింది. ఇవాల్టీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూసేయండి..

సత్యని నందా ఎక్కడికి తీసుకెళ్లాడో తెలియక ఆదిత్య టెన్షన్‌ పడుతుంటాడ. ఏమైందని రుక్మిణి అడగ్గా..ఏమీ లేదు..స్టడీస్‌ గురించి ఆలోచిస్తున్నానంటూ అబద్దం చెప్తాడు. ఇక సత్య ఎక్కడికి వెళ్లింది? అసలే ఒట్టి మనిషి కూడా కాదు అంటూ అభిమానం చూపిస్తుంటాడు. దీనికి ఒకింత షాక్‌ అయిన రుక్మిణి..సత్య అంటే నీకు మస్తు ప్రేమ కదా అని అమాయకంగా అడుగుతుంది. మీ చెల్లెలు అంటే ఈ ఇంటి మనిషి కంటే అందుకే అంటూ ఆదిత్య తడుముకుంటూ సమాధానం చెప్తాడు. ఇక రంగా బంతితో కలిసి ఊరు వదిలేసి వెళ్లిపోయాడన్న విషయాన్ని రుక్మిణి తన మామ ఈశ్వర్‌ ప్రసాద్‌తో చెప్పగా పరువు తీసాడంటూ రంగాపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. 

నందాను సత్య లైఫ్‌ నుంచి ఎలా తప్పించాలో తెలియక తీవ్రంగా మధనపడుతుంటాడు. ఇంతలో నందా వచ్చి బయటకు వెళ్లాలి కారు తాళాలు ఇవ్వమని డిమాండ్‌ చేస్తాడు. మొదట ఇవ్వనని భీష్మించుకున్న ఆదిత్య సడెన్‌గా రుక్మిణి వచ్చేసరికి కాస్త తగ్గుతాడు. ఇక భార్య కూడా నందాకు సపోర్ట్‌ చేయడంతో కారు తాళాలు ఇస్తాడు. మంచి ముహూర్తంలో సత్య మెడలో తాళి కడతానని చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోతాడు.

సీన్‌ కట్‌ చేస్తే.. నందా ఎక్కడికి తీసుకెళ్లాడు ఏం చేశాడు అన్న వివరాలను సత్యని అడిగి తెలుసుకుంటాడు ఆదిత్య. తనను భార్యలా ఫీల్‌ అవొద్దని నందాకు వార్నింగ్‌ ఇవ్వమని ఆదిత్య సత్యని కోరతాడు. నేను ప్రేమించింది ఇతన్నే..నా బిడ్డకు తండ్రి ఇతనే అనే పరిచయం చేసిన నందాను ఇప్పడు కాదు అని ఎలా చెప్పగలను? ఏమని చెప్పగలనంటూ సత్య బాధపడుతుంది. సీన్‌ కట్‌ చేస్తే బంతితో రంగా వెళ్లిపోయాడన్న నిజం తెలిసి రంగా భార్య ఊరికి చేరుకుంటుంది. పిన్నిని పలకరించడానికి వెళ్లిన ఆదిత్యతో దేవుడమ్మపై అగ్గి మీద గుగ్గిలం అవుతుంటుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top