ప్రముఖ నటుడు యశ్ నటించిన టాక్సిక్ సినిమా టీజర్ విడుదలై అభిమానులను ఆకట్టుకుంటోంది. దీని ప్రసారం నిలిపివేయాలని, లేదా గైడ్‌లైన్స్ సమేతంగా టీజర్ ప్రసారం చేయాలని ఓ న్యాయవాది రాష్ట్ర సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. కేంద్ర సెన్సార్ బోర్డుకు కూడా లేఖ ద్వారా ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఆ లాయరు శనివారం బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ టాక్సిక్ టీజర్‌లో బాలల చట్టాల ఉల్లంఘన జరిగింది.
టీజర్‌లో అతి హింసాత్మకమైన దృశ్యాలు ఉన్నా కూడా గైడ్‌లైన్స్ లేవు. కాబట్టి దానిని చూసేముందు గైడ్‌లైన్స్ వేయాలి, దానిని బట్టి ప్రేక్షకులు చూడాలా, వద్దా అనేది నిర్ణయించుకుంటారు అని చెప్పారు. టాక్సిక్ సినిమాను కుటుంబ సమేతంగా చూడటానికి సాధ్యపడదని అన్నారు. పిల్లలతో కలసి కుటుంబంతో కలసి టీజర్ చూశామని అనేక మంది అసంతృప్తిని వ్యక్తం చేశారని తెలిపారు.
కుమారస్వామి వీడియో
యశవంతపుర: టాక్సిక్ టీజర్‌ను ఆధారంగా కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి వీడియోను ఆయన అభిమానులు రూపొందించారు. టాక్సిక్ మ్యూజిక్ వస్తుండగా ఈ వీడియోలో మొదట సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్‌లు కనిపిస్తారు. 2028లో జరిగే ఎన్నికలపై వీరిద్దరూ మాట్లాడతారు. తరువాత కుమారస్వామి ఎంట్రీ ఇస్తారు.


