Chiyaan Vikram Sharing Screen WIth Kamal Haasan And Suriya In Vikram 2 - Sakshi
Sakshi News home page

Vikram 2: రోలెక్స్ కథలోకి విక్రమ్‌.. కమల్‌, సూర్యలతో స్క్రీన్‌ షేరింగ్‌!

Jan 21 2023 12:24 PM | Updated on Jan 21 2023 1:55 PM

Chiyaan Vikram Sharing Screen WIth Kamal Haasan And Suriya In Vikram 2 - Sakshi

గతేడాది కోలీవుడ్‌ నుంచి విడుదలైన సినిమాలల్లో విక్రమ్ ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో తెల్సిందే. ఈ ఒక్క సినిమాతో కమల్ మళ్లీ స్టార్ డమ్ అందుకున్నాడు.ఇదే సినిమాతో సూర్య కూడా రోలెక్స్‌గా ఫుల్లుగా పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఒక్క సినిమా ఇంత మంది స్టార్స్ లైఫ్స్ మార్చేస్తుందని ఎవరూ ఊహించలేదు.అందుకే ఇప్పుడు విక్రమ్ వరల్డ్ లోకి నిజంగానే విక్రమ్ అడుగు పెడుతున్నాడు. వాస్తవానికి ఈ రోలెక్స్‌ క్యారెక్టర్‌ కోసం ముందుగా విక్రమ్‌ని సంప్రదించారట దర్శకుడు లోకేశ్‌. అయితే క్యారెక్టర్ చిన్నగా ఉందని విక్రమ్‌ రిజెక్ట్ చేసాడట.

దాంతో సేమ్ క్యారెక్టర్ కోసం సూర్య దగ్గరికి వెళ్లగా,ఆయన కమల్ మీద అభిమానంతో రోలెక్స్ క్యారెక్టర్ చేశాడు. క్లైమాక్స్ లో ఈ క్యారెక్టర్‌ పెద్ద సెన్సేషన్ సృష్టించింది. అందుకే ఫ్యూచర్ లో రోలెక్స్ క్యారెక్టర్ తోనే పూర్తిస్థాయి సినిమా ఉంటుందని ప్రకటించాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్.ఇదంతా గతం.ఇప్పుడు లేటెస్ట్ స్టోరీ ఏంటంటే విక్రమ్ లో హీరో విక్రమ్ ఛాన్స్ మిస్ అయ్యాడు. అందుకే అతడిని కమల్ హీరోగా తెరకెక్కే విక్రమ్ -2లో నటింపజేస్తున్నాడట లోకేశ్‌. ఒకే సినిమాలో కమల్, విక్రమ్, సూర్య కలసి నటిస్తే ఆ సినిమా పై ఎక్స్ పెక్టేషన్స్ ఏ లెవల్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement