దానం చేయండి, నలుగురికి సాయపడండి: చిరంజీవి

Chiranjeevi Requests Coronavirus Survivors To Donate Plasma For Positive Patients - Sakshi

కరోనా పేషెంట్ల ప్రాణాలు రక్షించేందుకు మెగాస్టార్‌ చిరంజీవి మరోసారి సంకల్పించాడు. ఇదివరకే కరోనాతో పోరాడి దాన్ని జయించినవారు ప్లాస్మాదానం చేయాల్సిందిగా సోషల్‌ మీడియాలో విజ్ఞప్తి చేశాడు. ఈ సందర్భంగా సెకండ్‌ వేవ్‌లో కరోనా బాధితులు మరింతగా పెరుగుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ముఖ్యంగా ప్లాస్మా కొరత వల్ల చాలామంది ప్రాణాల కోసం పోరాడుతున్నారని తెలిపాడు. వారిని ఆదుకునేందుకు ముందుకు రావాలంటూ ప్రజలకు పిలుపునిచ్చాడు.

కరోనా నుంచి కొద్ది రోజుల ముందే రికవరీ అయితే ప్లాస్మాని దానం చేయండని కోరాడు. దీనివల్ల కొద్ది మందైనా కరోనా నుంచి కోలుకునేందుకు సాయపడిన వారవుతారని పేర్కొన్నాడు. తన అభిమానులు కూడా తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నొక్కి చెప్పాడు. ప్లాస్మా డొనేషన్‌ గురించి వివరాలకు, సరైన సూచనలకు చిరంజీవి చారిటబుల్‌ ఫౌండేషన్‌ ఆఫీస్‌ నంబర్లు 040-23554849, 944005577ను సంప్రదించాలని సూచించాడు. 

చదవండి: నర్సింగ్‌ యాదవ్‌ కొడుక్కి మెగాస్టార్‌ బంగారు కానుక‌!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top