
జయశంకర్ తెరకెక్కించిన ‘అరి’ చిత్రం నిన్న(అక్టోబర్ 10) ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ని సంపాదించుకుంది. ఈ వారం వచ్చిన చిత్రాలన్నింట్లోనూ అరి కాస్త ముందు వరుసలో ఉందని చెప్పుకోవచ్చు. అరికి మంచి ప్రశంసలు లభించడం, ఆదరణ దక్కుతుండటంతో టీంలో కొత్త ఉత్తేజం వచ్చినట్టుగా కనిపిస్తోంది.
ఇక ‘అరి’ సక్సెస్ సాధించడంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం దర్శకుడు జయశంకర్‌ను అభినందించారు. ఏడేళ్ల శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కిందని కొనియాడారు. అరి విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు.
ఈ చిత్రంలో వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయికుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. అర్వీ రెడ్డి సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి నిర్మించారు.