
ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మూవీ త్వరలో ఓటీటీలోకి రానుంది. తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన ఆహా స్పెషల్ పోస్టర్ వదిలింది. ఇగ టిల్లుగాడి లొల్లి ఆహాలో..
సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘డీజె టిల్లు’. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన 12 ఏళ్లకు పూర్తి స్థాయిలో ప్రేక్షకుల అభిమానం పొందాడు హీరో సిద్ధు. విమల్ కృష్ణ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న విడుదలైంది. ఈ మూవీ విజయవంతం కావడంతో దీనికి సీక్వెల్ తెరకెక్కించే ప్లాన్‌లో ఉన్నారు నిర్మాతలు.
ఇదిలా ఉంటే ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మూవీ త్వరలో ఓటీటీలోకి రానుంది. తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన ఆహా.. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ వదిలింది. 'ఇగ టిల్లుగాడి లొల్లి ఆహాలో.. అతి త్వరలో' అంటూ అభిమానులను ఊరించింది. అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం డీజే టిల్లు ఆహాలో మార్చి 10 నుంచి ప్రసారమయ్యే అవకాశముందని తెలుస్తోంది. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే!
DJ Tillu dhummu dhulapadaniki vacchesthunnadu. Scratch untadi, ready ga undandi. #ahaLoDJTillu@Siddu_buoy @iamnehashetty @K13Vimal
— ahavideoIN (@ahavideoIN) February 25, 2022
@MusicThaman @vamsi84 @SricharanPakala
@NavinNooli @SitharaEnts @Fortune4Cinemas @AnindithaMedia #rammiryala pic.twitter.com/zYk6K9G5a7