
బిగ్‌బాస్ రియాల్టీ గేమ్ షో (Bigg Boss Reality Show) నుంచి బయటికి వచ్చిన పలువురు సినిమాల్లో హీరోగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తాజాగా బిగ్ బాస్ ఫేమ్ విక్రమన్ కథానాయకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈయన హీరోగా నటిస్తున్న చిత్రాన్ని గోల్డెన్ గెట్ స్టూడియోస్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి ప్రీతి కరికాలన్ కథ, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలను ఇటీవల చైన్నెలో నిరాడంబరంగా నిర్వహించారు. బుధవారం నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు.
దర్శకురాలు మాట్లాడుతూ.. బిగ్‌బాస్ ఫేమ్ విక్రమన్‌ను హీరోగా ఎంపిక చేయడానికి కారణం అతని పర్సనాలిటీ అందర్నీ ఆకట్టుకునే విధంగా ఉండడమేనన్నారు. ఈ చిత్రంలోని కథానాయకుడి పాత్రకు తను పర్ఫెక్ట్‌గా ఉంటారన్నారు. చిత్ర కథ వాస్తవానికి దగ్గరగా, చాలా ఫ్రెష్‌గా కలర్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని చెప్పారు. సంగీతం, విజువల్స్ అదనపు ఆకర్షణగా నిలుస్తాయన్నారు. టోటల్‌గా ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమాకు శ్రీధర్ ఛాయాగ్రహణం, అజేష్ అశోకన్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా విక్రమన్.. తమిళ బిగ్‌బాస్ ఆరో సీజన్‌లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచాడు.