Bigg Boss Telugu 6: First Week Nomination List - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: మొదటి వారం నామినేషన్స్‌లో ఉన్నది వీళ్లే!

Sep 7 2022 4:10 PM | Updated on Sep 7 2022 5:52 PM

Bigg Boss Telugu 6: First Week Nomination List - Sakshi

సోషల్‌ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారమైతే బాలాదిత్య నామినేషన్‌లో నుంచి సేఫ్‌ అయ్యాడట! ఫైనల్‌గా మొదటి వారం అభినయ, ఇనయతో పాటు ఆరోహి రావు, ఫైమా, చంటి, రేవంత్‌, శ్రీసత్య

ఇప్పటిదాకా ఒక లెక్క... ఇప్పుడింకో లెక్క అంటున్నాడు బిగ్‌బాస్‌. గతంలో బిగ్‌బాస్‌ మొదలైన మొదటి రోజే నామినేషన్స్‌ జరిగేవి. కానీ ఈసారి మాత్రం టాస్కులిస్తూ, ఆడిస్తూ ఆ తర్వాత నామినేషన్స్‌ ప్రక్రియ నిర్వహించాడు. క్లాస్‌.. మాస్‌.. ట్రాష్‌ టాస్క్‌ ముగిశాక ట్రాష్‌ టీమ్‌లో ఉన్న బాలాదిత్య, అభినయ శ్రీ, ఇనయ సుల్తానా నేరుగా నామినేషన్‌లోకి వచ్చారు. అయితే బిగ్‌బాస్‌ ఈరోజు ప్రతి ఒక్క ఇంటిసభ్యుడు ఇద్దరిని నామినేట్‌ చేయాలని ఆదేశించాడు.

ఇదివరకే రిలీజైన ప్రోమోలో అయితే సింగర్‌ రేవంత్‌కు ఎక్కువ ఓట్లు పడ్డట్లు తెలుస్తోంది. సోషల్‌ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారమైతే బాలాదిత్య నామినేషన్‌లో నుంచి సేఫ్‌ అయ్యాడట! ఫైనల్‌గా మొదటి వారం అభినయ, ఇనయతో పాటు ఆరోహి రావు, ఫైమా, చంటి, రేవంత్‌, శ్రీసత్య నామినేషన్స్‌లో ఉన్నట్లు వినికిడి. ఎలాగో రేవంత్‌, ఫైమా, చంటి వారికున్న పాపులారిటీతో ఈజీగా ఈ గండం నుంచి గట్టెక్కడం గ్యారెంటీ. మిగిలినవారిలో ఆరోహి, ఇనయ డేంజర్‌ జోన్‌లో ఉన్నారు. మరి వీరిలో ఎవరు ఉంటారు? ప్రేక్షకులు ఎవరిని పంపించేస్తారో చూడాలి!

చదవండి: కపుల్‌ మధ్య మొదలైన చిచ్చు, అప్పుడే ఏమైంది!
నామినేషన్‌ నుంచి తప్పించుకోలేకపోయిన ఆర్జీవీ హీరోయిన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement