Bigg Boss 6 : నాగార్జుననే నిలదీసిన కీర్తి.. షాకిచ్చిన ఆడియన్స్!

బిగ్‌బాస్ హౌస్‌లో వీకెండ్ వస్తే సందడి నెలకొంటుంది. హోస్ట్ నాగార్జున వచ్చి హౌస్‌మేట్స్‌తో ఆటలు ఆడించడంతో పాటు వారంలో వారి చేసిన తప్పొప్పులు ఏంటో చెబుతాడు. నాగ్ ఏం చెప్పిన హౌస్‌మేట్స్ వింటారు. సూచించిన సలహాలను పాటిస్తూ ఆటను మెరుగు పరుచుకుంటారు. కొన్నిసార్లు తప్పులేకున్నానా నాగార్జున ఫైర్ అయితే బాధ పడ్డారే తప్ప తిరిగి ప్రశ్నించిన కంటెస్టెంట్స్ ఎవరూ లేరు. కానీ తొలిసారి బిగ్‌బాస్ 6లో ఓ కంటెస్టెంట్స్ నాగార్జునను నిలదీసింది. ఇంట్లో టాస్క్‌లు బాగా ఆడుతున్నప్పటికీ తనకు ఎందుకు యావరేజ్ రేటింగ్ ఇచ్చారని ప్రశ్నించింది. ఆ కంటెస్టెంట్స్ ఎవరో కాదు కీర్తి భట్.
(చదవండి: మా వాడికి ఫెవిస్టిక్‌లా అతుక్కుపోయింది..ఇనయాపై సూర్య గర్ల్‌ఫ్రెండ్ ఫైర్)
శనివారం నాటి ఎపిసోడ్‌లో నాగార్జున హౌస్‌మేట్స్ ఆటతీరుకి రేటింగ్ ఇచ్చాడు. ఆట తీరును బట్టి ప్రతీ కంటెస్టెంట్‌కి ‘గుడ్, యావరేజ్ మరియు డెడ్’ రేటింగ్ ఇచ్చాడు. ఇందులో భాగంగా కీర్తికి ‘యావరేజ్’ రేటింగ్ వేశాడు నాగ్. దీంతో కీర్తి చాలా ఫీలైంది. వెంటనే లేచి ‘సార్.. ఏం అనుకోనంటే మిమ్మల్ని ఒకటి అడగొచ్చా?’అని అనడంతో నాగార్జున ‘ఏంటో చెప్పమ్మ పర్లేదు’ అన్నాడు. అప్పుడు కీర్తి మాట్లాడుతూ.. సార్..ఈ వారం నేను అన్ని టాస్కులను బాగా ఆడాను..ఆ బాల్ టాస్క్ లో అయితే ఫైమా కంటే నేనే బాగా ఆడాను..ఆమెకి ఏమో గుడ్ అని ఇచ్చారు..నాకు ఏమో బ్యాడ్ అని ఇచ్చారు..ఎందుకు సార్? నేను ఇంటి పనులు చేస్తున్నాను..టాస్కులు ఆడుతున్నాను..అందరితో కలిసిపోయి బాగున్నాను..నాలో ఏమి లోపం ఉందొ చెప్తే నేనే సరి చేసుకుంటాను’ అని కీర్తి అడిగింది.
కీర్తి ప్రశ్నకు నాగార్జున తనదైన శైలీలో సమాధానం ఇచ్చాడు. ‘ నువ్వు ఆ బాల్ టాస్కు గురించే మాట్లాడుతున్నావ్.. వారం మొత్తం టాస్కు ఒక్కటే ఆడవా ?. ఫైమా కంటే బాగా ఆడాను అని నువ్వు అంటున్నావు..ఇదే విషయం ని ఆడియన్స్‌ని అడుగుతాను..వాళ్ళు ఏమి చెప్తారో చూద్దాం’ అని ఆడియన్స్ ఒపీనియర్ అడిగాడు. వాళ్లంతా ముక్తకంఠంతో ‘నో’అని సమాధానం ఇచ్చారు.
అప్పుడు నాగార్జున..‘చూశావా.. ఆడియన్స్ ఏమి అన్నారో..పోనీ నేను నీకు ఒక నిమిషం సమయం ఇస్తున్నాను..ఆడియన్స్ తో నువ్వు మాట్లాడి వాళ్ళు చెప్పిన ఒపీనియన్ ని తప్పు అని నిరూపించగలవా’ అని అడగగా..అప్పుడు కీర్తి మాట్లాడుతూ ‘ఆడియన్స్ అంతా చూస్తున్నారు కదా సార్’ అనగా.. ‘చూస్తున్నారు కాబట్టే అలా చెప్పారు..నీకు చాలా క్యాలిబర్ ఉంది..నీ నుంచి వాళ్ళు ఇంకా ఎక్కువ కోరుకుంటున్నారు. .అది ఇవ్వడానికి ట్రై చెయ్..నీలో ఆ ఫైర్ ని పెంచడానికే ఇదంతా చెబుతున్నాను’అని నాగ్ అన్నారు. అప్పుడు కీర్తి ‘ఓకే సార్... వచ్చే వీక్ మరింత బాగా ఆడతాను’ అంటూ కూర్చుంది. మొత్తానికి నాగ్‌ని ఎదురించిన కీర్తికి ఆడియన్స్ పెద్ద షాకే ఇచ్చారు.
మరిన్ని వార్తలు
మరిన్ని వీడియోలు