అవినాష్ క‌న్నీళ్లు: మాస్ట‌ర్ వెళ్లిపోతున్నందుకా!? | Bigg Boss 4 Telugu: Whats The The Reason Behind Avinash Crying | Sakshi
Sakshi News home page

ఏడుస్తున్న అవినాష్‌, అరియానా: అందుకోస‌మేగా!

Nov 8 2020 4:34 PM | Updated on Nov 8 2020 8:18 PM

Bigg Boss 4 Telugu: Whats The The Reason Behind Avinash Crying - Sakshi

విప‌త్తు ఎన్నో మార్పులు తీసుకొచ్చిందంటూ పంచ్ క్వీన్, యాంక‌ర్ సుమ బిగ్‌బాస్ హౌస్‌లోకి వస్తోంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటూ ప్రోమో కూడా వేసేశారు. కానీ ఆమె దీపావ‌ళి కానుక‌ల‌ను కంటెస్టెంట్ల‌కు ఇవ్వ‌డానికో, టీఆర్పీలు పెంచ‌డానికో సూట్‌కేసుతో స‌హా హౌస్‌లోకి అడుగు పెట్టిన‌ట్లు క‌నిపిస్తోంది. ఒక‌వేళ నిజంగానే ఆమె వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇస్తే మాత్రం ప్రేక్ష‌కుల‌కు క‌న్నుల‌పండ‌గే. ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో నాగార్జున ఇంటిస‌భ్యులంద‌రికీ గిఫ్టులు పంపించారు. కానీ వాటిని పొందాలంటే మాత్రం చెప్పిన టాస్కులు చేయాల్సిందేన‌ని ట్విస్ట్ ఇచ్చాడు. అందులో భాగంగా అభికి అన్నింటిక‌న్నా క‌ష్ట‌మైన డ్యాన్స్ చేయ‌మ‌న్నాడు. దాన్ని ప‌నిష్మెంట్‌లా భావించిన అభి.. దీని త‌ర్వాత త‌న‌కు కెరీర్ ఉండ‌ద‌ని వాపోయాడు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: ఒక‌రు సేఫ్‌, మ‌రొక‌‌రికి ఇమ్యూనిటీ)

మెహ‌బూబ్‌ను చేతుల‌తో ముట్టుకోకుండా బిస్కెట్లు తినాల‌న్నాడు. అంద‌రిక‌న్నా అఖిల్ ప‌రిస్థితి మ‌రీ న‌వ్వు తెప్పిస్తోంది. అందానికి ఎక్కువ ప్రాధాన్య‌త‌నిచ్చే అఖిల్‌కు ఒంటిక‌ళ్ల‌జోడును అందించారు. దీంతో అత‌డు ఓ క‌న్నుపోయిన‌ గ‌జ‌దొంగ‌లా క‌నిపిస్తున్నాడు. చివ‌ర్లో అవినాష్ నేల‌పై మోక‌రిల్లుతూ ఏడుస్తున్నాడు. స్నేహితుడు క‌న్నీళ్లు పెట్టుకోవ‌డం చూసి త‌ట్టుకోలేక‌పోయిన అరియానా కూడా కంత‌డి పెడుతోంది. అయితే అవినాష్‌ వెన‌కాల సోఫాపై మొబైల్ ఫోన్ కూడా ఉంది. ఇది ఎన్నో అనుమానాల‌ను తావిస్తోంది. ఫోన్ ద్వారా అమ్మ రాజ‌శేఖ‌ర్ ఎలిమినేట్ అయ్యాడ‌ని తెలిసిందా?  లేదా త‌న కుటుంబం నుంచి ఏమైనా ఫోన్ వ‌చ్చిందా? అదీ కాకుండా ఏడ‌వాల‌ని నాగ్ టాస్క్ ఇచ్చాడా?  ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం దొర‌కాలంటే నేటి ఎపిసోడ్ వ‌చ్చేంత‌వ‌ర‌కు వేచి చూడాల్సిందే.. (చ‌ద‌వండి: పునర్న‌వి నిశ్చితార్థం అంతా ఉత్తిదే)

Advertisement
 
Advertisement
Advertisement