పునర్న‌వి నిశ్చితార్థం అంతా ఉత్తిదే

Punarnavi Bhupalam Reveals She Acting In Commit Mental Web Series - Sakshi

బిగ్‌బాస్ మూడో సీజ‌న్‌లో పాల్గొన్న భామ‌ పున‌ర్న‌వి భూపాలం 'ఎట్ట‌కేల‌కు ఇది జ‌రుగుతోంది' అంటూ సోష‌ల్ మీడియాలో చేసిన పోస్టు విప‌రీతంగా వైర‌ల్ అయిన విష‌యం తెలిసిందే. త‌న వేలికి ఉంగ‌రం ఉండ‌టంతో పెళ్లి క‌బురు చెప్పేసిందోచ్ అంటూ రెండురోజులుగా ఆమె అభిమానులు కేరింత‌లు కొడుతున్నారు. కానీ ముందుగా ఊహించ‌నట్టుగానే వారంద‌రికీ పున్నూ పెద్ద షాకే ఇచ్చింది. అదంతా ప‌బ్లిసిటీ స్టంట్ అని చెప్ప‌క‌నే చెప్పింది. ఈ మేర‌కు తాను చేస్తున్న వెబ్ సిరీస్ పోస్ట‌ర్‌ను పంచుకుంది. ఉద్భ‌వ్‌తో క‌లిసి "క‌మిట్ మెంట‌ల్" వెబ్ సిరీస్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా'లో న‌వంబ‌ర్ 13 నుంచి ఇది ప్ర‌సారం కానుంది. "త‌ప్ప‌లేక ఒప్పుకున్నాను. ఇంకా ముందుంది అస‌లైన క్రేజీ రైడ్‌. మీరు కూడా ఇందులో భాగ‌స్వాములు కండి" అని పిలుపునిచ్చింది. (చ‌ద‌వండి: చికాగో సుబ్బారావుతో పున్నూ బేబీ..)

కాగా బిగ్‌బాస్ మూడో సీజ‌న్‌లో రాహుల్‌, పున‌ర్న‌విల ల‌వ్‌ట్రాక్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ర్షించింది. అయితే బ‌య‌ట‌కు వ‌చ్చాక మా మ‌ధ్య‌లో ఏమీ లేదు, ఫ్రెండ్‌షిప్ త‌ప్ప అని రూమ‌ర్ల‌కు చెక్ పెట్టారు. కొంత‌కాలం స్నేహితులుగానైనా క‌లిసి క‌నిపించిన‌ ఈ జోడీ త‌ర్వాత‌ ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయ్యారు. అయినా స‌రే రాహుల్ అభిమానులు మాత్రం ఇప్ప‌టికీ పున‌ర్న‌విని స్పెష‌ల్‌గా ట్రీట్ చేస్తారు. ఈ క్ర‌మంలో ఆమె రెండు రోజుల క్రితం ఎంగేజ్‌మెంట్ జ‌రిగింద‌న్న అనుమానాల‌ను రేపుతూ చేసిన ట్వీట్‌తో అంద‌రూ రాహుల్ మీద ప‌డ్డారు. పున్నూ బేబీ.. చిచాకు అన్యాయం చేసింద‌ని ఆక్రోశం వెల్ల‌గ‌క్కారు. దీనిపై స్పందించిన రాహుల్ సిప్లిగంజ్‌.. "ఎవ‌రిదో ఎంగేజ్‌మెంట్ అయితే న‌న్నెందుకు ట్యాగ్ చేస్తుర్రురా బై, ఉన్న పోరీల‌తోనే స‌రిపోత‌లేదు నాకు. ఇంకా ఎక్స్‌ట్రా ఫిట్టింగులు నాకెందుకురా నాయ‌నా " అంటూ దండం పెడుతున్న ఎమోజీ పెట్టాడు. (చ‌ద‌వండి: చివరకు.. ఇది జరుగుతుంది: పునర్నవి)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top