Bandla Ganesh: వదినగా మీరున్నందుకు చాలా సంతోషం: బండ్ల గణేశ్

Bandla Ganesh Birthday Wishes To Megastar Wife Surekha - Sakshi

టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ గురించి పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించారు. మెగా ఫ్యామిలీ పట్ల ఆయనకు ప్రత్యేక అభిమానం ఉంది. తాజాగా ఇవాళ చిరంజీవి సతీమణి సురేఖ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు బండ్ల గణేశ్. ఈ మేరకు తన ట్విటర్‌లో చిరంజీవి దంపతుల ఫోటోను షేర్ చేశారు. 

బండ్ల గణేశ్ తన ట్విటర్‌లో రాస్తూ..'సీతాదేవి అంత ఓర్పు. భూదేవంత గొప్పతనం. లక్ష్మీదేవి లాంటి నవ్వు. రాముడి లాంటి భర్తకు అర్ధాంగిగా.. వజ్రం లాంటి బిడ్డకు తల్లిగా.. ఎందరో లక్ష్మణులకు వదినగా మీరుండటం మాకెంతో సంతోషం. ఇలాంటి జన్మదినాలు మీరు ఎన్నో జరుపుకోవాలని ఆ పరమేశ్వరున్ని మనసారా కోరుకుంటూ.. జన్మదిన శుభాకాంక్షలు' అంటూ సురేఖ , చిరంజీవి దంపతులు ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top