B Praak Wife Emotional Note: పురిట్లోనే మరణించిన బిడ్డ కోసం తల్లడిల్లిపోతున్న సింగర్‌ భార్య

B Praak Wife Meera Shares Emotional Note Month After Losing Child - Sakshi

పెళ్లైన ప్రతి మహిళ అమ్మ అని పిలిపించుకోవాలని ఆశపడుతుంది. ప్రముఖ సింగర్‌ బి పరాక్‌ భార్య మీరా బచ్చన్‌ కూడా అలాగే ఆశపడింది. గర్భం దాల్చింది, కడుపులో బిడ్డను నవమాసాలు మోసింది. కన్నబిడ్డను చూడాలని వేయి కళ్లతో ఎదురుచూసిందా తల్లి. కానీ ఆమె ఒకటి తలిస్తే దైవం మరోలా తలిచింది. ప్రసవంలోనే బిడ్డ కన్నుమూసింది. దీంతో ఆమె బాధ అంతా ఇంతా కాదు. పురిట్లోనే కన్నబిడ్డ తనువు చాలించడాన్ని తట్టుకోలేకపోయింది. ఇది జరిగి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటికీ బాధతో విలవిల్లాడిపోతోంది. తాజాగా ఆమె సోషల్‌ మీడియాలో భావోద్వేగ లేఖ రాసుకొచ్చింది.

'మనం మళ్లీ కలిసేదాకా నిన్ను మిస్‌ అవుతూనే ఉంటాను. నువ్వు ఎక్కడున్నా సంతోషంగా, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నా. నా కంటే కూడా ఎవరో నువ్వు కావాలని గట్టిగా కోరుకున్నారు. కానీ నువ్వు తిరిగి రావాలని నేను ప్రార్థిస్తూనే ఉంటా. ఆ సమయం వచ్చాక ఇక నువ్వు ఎప్పటికీ నావాడివే..' అని రాసుకొచ్చింది మీరా. కాగా ప్రాక్‌, మీరా 2019లో పెళ్లి చేసుకున్నారు. వీరు 2020లో బిడ్డకు జన్మనిచ్చారు.

గత నెలలో వీరు రెండో బిడ్డకు జన్మనిచ్చినప్పటికీ అతడు పురిట్లోనే కన్నుమూయడంతో వీరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా బిప్రాక్‌ బాలీవుడ్‌ చిత్రాలకు పాటలు పాడుతూ, స్టేజి షోలతో మంచి సింగర్‌గా గుర్తింపు పొందాడు. అంతేకాదు అతడి పాటలకు దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. తెలుగులో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో సూర్యుడివో చంద్రుడివో.. అనే పాట పాడి తెలుగు ప్రేక్షకులను సైతం అలరించాడు.

చదవండి: ఈ వారం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైన సినిమాలు
నితిన్‌ మాట తప్పి అవమానించాడు, అన్నం కూడా తినకుండా..

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top