ఆశిష్‌కి ఈ సినిమా ఓ సవాల్‌ | Ashish new movie Selfish motion poster release | Sakshi
Sakshi News home page

ఆశిష్‌కి ఈ సినిమా ఓ సవాల్‌

Published Sat, Apr 16 2022 5:08 AM | Last Updated on Sat, Apr 16 2022 5:08 AM

Ashish new movie Selfish motion poster release - Sakshi

ప్రముఖ నిర్మాత ‘దిల్‌’ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్‌ తనయుడు ఆశిష్‌ ‘రౌడీ బాయ్స్‌’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. ఆశిష్‌ హీరోగా నటిస్తున్న రెండో సినిమా ‘సెల్ఫిష్‌’ శుక్రవారం హైదరాబాద్‌లో ఆరంభమైంది. విశాల్‌ కాశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మాతలు. ముహుర్తపు సన్నివేశానికి దర్శకుడు హరీష్‌ శంకర్‌ కెమెరా స్విచాన్‌ చేయగా, తమిళ స్టార్‌ ధనుష్‌ క్లాప్‌ ఇచ్చారు.

దర్శకుడు అనిల్‌ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించడంతో పాటు మోషన్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. అనంతరం ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ.– ‘‘రౌడీ బాయ్స్‌’తో మా ఆశిష్‌ నటుడిగా ప్రూవ్‌ చేసుకున్నాడు. ఆ సినిమా తనకు టైలర్‌ మేడ్‌. కానీ ఈ సినిమా తనకు ఓ చాలెంజ్‌లాంటిది. నేను, సుకుమార్‌ ‘ఆర్య’ (2004) సినిమాకు పని చేశాం. ఇన్నేళ్లకు ‘సెల్ఫిష్‌’కు మేం పని చేయడం ఆనందంగా ఉంది. ‘సెల్ఫిష్‌’ ఐడియా చెప్పినప్పుడే బాగా నచ్చి సినిమా చేద్దామని కాశీకి చెప్పాను. స్టోరీ పర్ఫెక్ట్‌గా సెట్‌ అయింది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మణికందన్‌ .ఎస్, సంగీతం: మిక్కీ జే మేయర్, సహనిర్మాతలు: హర్షిత్‌ రెడ్డి, హన్షితా రెడ్డి, అశోక్‌ బండ్రెడ్డి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement