నిజాన్ని నొక్కేస్తున్నారు, ఇంతలా దిగజారాలా?: నటుడు | Sakshi
Sakshi News home page

Arjun Kapoor: 'మలైకా ప్రెగ్నెంట్‌?' ఇంతలా దిగజారాలా? అంటూ నటుడి వార్నింగ్‌

Published Wed, Nov 30 2022 8:37 PM

Arjun Kapoor Fires On Malaika Arora Pregnant Rumours - Sakshi

నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరు చుట్టేస్తుందంటారు.. సెలబ్రిటీల విషయంలో అక్షరాలా ఇదే జరుగుతుంది. వాళ్లు ఏం చేసినా దానికి నానార్థాలు తీస్తుంటారు. కొత్తవ్యక్తితో కనిపిస్తే లవ్‌లో ఉన్నారని, వదులైన డ్రెస్‌ వేసుకుంటే ప్రెగ్నెంట్‌ అని ఇలా ఏదేదో అనేస్తుంటారు. కొందరు దీన్ని సీరియస్‌గా తీసుకోకపోయినా మరికొందరు మాత్రం ఘాటుగానే జవాబిస్తుంటారు.

తాజాగా బాలీవుడ్‌ నటి మలైకా అరోరా గర్భం దాల్చిందంటూ నెట్టింట పుకార్లు షికార్లు చేశాయి. ఇదే నిజమంటూ ఓ వెబ్‌సైట్‌  కథనం కూడా రాసేయడంపై మలైకా ప్రియుడు, నటుడు అర్జున్‌ కపూర్‌ ఫైర్‌ అయ్యాడు. మీరు ఎంతో సాధారణంగా భావించి రాసే వార్త మాకు ఎంత సెన్సిటివ్‌గా అనిపిస్తుందో మీకేం తెలుసు? ఇంత అనైతికంగా దిగజారి ఇలాంటి చెత్తవార్తలు ఎలా రాస్తున్నారు? ఇదే కాదు, చాలా వార్తలు ఈమె ఇలాగే రాసింది. మేము ఇలాంటి కథనాలపై స్పందించట్లేదు కదా అని ఈ ఫేక్‌ న్యూస్‌లను సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ చేసి నిజాన్ని నొక్కేస్తున్నారు. ఇది ఇక్కడితో ఆగిపోలేదు. మా వ్యక్తిగత జీవితాలతో ఆడుకునేంత ధైర్యం చేయకండి అని ఓరకంగా వార్నింగే ఇచ్చాడు.

చదవండి: టికెట్‌ టు ఫినాలే టాస్క్‌ విజేత ఎవరో తెలుసా?
పుష్ప సినిమాలో హీరో ఎవరో తెలియదు: నటి

Advertisement
 
Advertisement
 
Advertisement