Anushka Sharma: కోర్టును ఆశ్రయించిన అనుష్క శర్మ

Anushka Sharma Moves Bombay HC Against 1.2 Crore Tax Demand - Sakshi

బాలీవుడ్‌ హీరోయిన్‌, టిమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి భార్య అనుష్క శర్మ కోర్టు మెట్లు ఎక్కారు. పన్ను ఎగవేత కేసులో ఆమె తాజాగా కోర్టును ఆశ్రయించారు. వివరాలు.. ట్యాక్స్‌ రికవరి కోసం సేటస్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఇటీవల అనుష్కకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నోటిసులను సవాలు చేస్తు తాజాగా ఆమె ముంబై హైకోర్టును ఆశ్రయించింది. ఈ నోటీసులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్వయంగా కోర్టులో కొత్త పటిషన్‌ దాఖలు చేసింది.

చదవండి: షాకింగ్‌.. ఏంటీ జయసుధ మళ్లీ పెళ్లి చేసుకుందా? ఫొటోలో ఉన్న వ్యక్తి ఎవరు?

2012-13, 2013-14 సంవత్సరాలకు సంబంధించిన పన్ను రికవరీ కోసం సేల్స్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌ అనుష్కకు నోటీసులు పంపింది. గతంలోనే ఈ కేసును విచారించిన కోర్టు.. అనుష్క శర్మపై సీరియస్ అయ్యింది. ట్యాక్స్ కన్సల్టెంట్ ద్వారా పిటీషన్ ను దాఖలు చేయడం తాము ఇంతవరకు చూడలేదని, డైరెక్ట్‌గా పిటీషన్ ఎందుకు వేయలేదంటూ ఆమె తరపున న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. దీంతో అనుష్క శర్మ స్వయంగా కోర్టుకు హాజరై కొత్త పిటీషన్‌ను దాఖలు చేసింది.

చదవండి: ‘వాల్తేరు వీరయ్య’ ఓటీటీ పార్ట్‌నర్‌ ఏదో తెలుసా? స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే!

రకరకాల సందర్భాల్లో ప్రొడ్యూసర్స్, ఈవెంట్ ఆర్గనైజర్లతో చేసుకున్న ఒప్పందం ప్రకారం నటిగా మూవీతో పాటుగా కొన్నిఅవార్డు ఫంక్షన్స్ లల్లో పాల్గొంటాను. అలాగని నిర్మాతలకు విధిస్తున్న శ్లాబుల్లో పన్ను చెల్లించాలి అంటే ఎలాగని తన పటిషన్‌లో పేర్కొంది. ఇక నటులకు వర్తించే శ్లాబుల్లోనే పన్నులు వేయాలి ఆమె తెలిపింది. కాగా అనుష్క కు 2012-13లో రూ. 1.2 కోట్ల వడ్డీతో కలిపి రూ. 12.3 కోట్లు పన్ను నిర్ణయించగా.. 2013-14 సంవత్సరానికి గాను దాదాపుగా రూ. 17 కోట్ల విక్రయ పన్ను రూ. 1.6 కోట్లుగా ఉందని ఆదాయ శాఖ తమ నోటీసులో పేర్కొంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top