‘సాక్షి’ అవార్డు నాకో సర్‌ప్రైజ్‌ : అనిల్‌ రావిపూడి | Anil Ravipudi Bags Sakshi Excellence Award For Most Popular Director | Sakshi
Sakshi News home page

Sakshi Excellence Awards: ఎఫ్‌ 2’ నా కెరీర్‌కు ఒక గేమ్‌ చేంజర్‌: అనిల్‌ రావిపూడి

Sep 25 2021 11:00 AM | Updated on Sep 26 2021 11:12 AM

Anil Ravipudi Bags Sakshi Excellence Award For Most Popular Director

సాక్షి మీడియా గ్రూప్‌ అందించిన ‘సాక్షి  ఎక్స్‌లెన్స్‌’ పురస్కారాల్లో భాగంగా మోస్ట్‌ పాపులర్‌ డైరెక్టర్‌(ఎఫ్‌ 2) అవార్డును  అనిల్‌ రావిపూడి అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ఎఫ్‌ 2’ నా కెరీర్‌కు ఒక గేమ్‌ చేంజర్‌లా ఫీల్‌ అవుతాను. ఈ సినిమా నాకు సర్‌ప్రైజులు ఇస్తూనే ఉంది. ఇది కూడా (‘సాక్షి’ అవార్డు) ఓ సర్‌ప్రైజ్‌. ఈ ప్యాండమిక్‌ తర్వాత ఇప్పుడిప్పుడే షూటింగ్స్‌ మొదలుపెట్టి, చక్కగా పని చేసుకుంటున్నాం. ఇలాంటి టైమ్‌లో ‘సాక్షి’ యాజమాన్యం అవార్డ్స్‌ ఇవ్వటం అనేది మా అందరికీ ఒక బూస్టింగ్‌లా అనిపించింది.

నాకు ఇష్టమైన డైరెక్టర్‌ త్రివిక్రమ్‌గారి చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. నేను చదువుకునే రోజుల్లో నాకు జంధ్యాలగారు, ఈవీవీగారంటే చాలా ఇష్టం. ఇంజినీరింగ్‌లో ఉన్నప్పుడే త్రివిక్రమ్‌గారి సినిమాలు చూసి, ఆయన రాసే స్టైల్, డైలాగ్స్‌ గురించి మాట్లాడుకునేవాళ్లం. మా జనరేషన్‌  డైరెక్టర్స్‌ అందరికీ వాళ్లు తీసిన సినిమాలు మా మైండ్‌ మీద ఎంతో కొంత ప్రభావం చూపించే ఉంటాయి. ‘థ్యాంక్యూ సో మచ్‌ సార్‌.. ఫీలింగ్‌ వెరీ ప్రౌడ్‌. ఈ అవార్డు మీ చేతుల మీదుగా తీసుకోవడం ఆనందంగా ఉంది’ అన్నారు.    

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement