
విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘లైగర్’. దాదాపు షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈమూవీ నిర్మాణాంతర కార్యక్రమాలను కూడా జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే ఇటీవల విజయ్, అనన్య పాండేలు ఓ ఇంటర్య్వూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనన్య, విజయ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ.. విజయ్ బెస్ట్ కో-స్టార్ అని కితాబు ఇచ్చింది. అయితే ‘సినిమాలో కనిపించేదాని కన్నా విజయ్ బయట చాలా భిన్నంగా ఉంటాడు. ఒక్కోసారి అతడిని చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. సినిమాల్లో అతడి పాత్రలన్ని ధైర్యవంతంగా ఉంటాయి.
చదవండి: రష్మిక మొత్తం ఆస్తి, ఏడాది సంపాదన ఎన్ని కోట్లో తెలిస్తే షాకవ్వాల్సిందే!
కానీ బయట మాత్రం విజయ్ చాలా భయటపడతాడు. సహజంగా విజయ్ పిరికివాడు’ అంటూ చెప్పకొచ్చింది. కానీ విజయ్ మంచి సహానటుడని, ఒక కో-స్టార్ నుంచి ఎలాంటి కంఫర్ట్స్ ఉండాలనుకుంటామో అవన్ని విజయ్ దగ్గర ఉంటాయని చెప్పింది. దీంతో ప్రస్తుతం అనన్య కామెంట్స్ హాట్‌టాపిక్‌గా మారాయి. కాగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ పాన్ ఇండియా మూవీని ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ కలిసి నిర్మిస్తున్నాయి. 2022 అగష్టు 25 ప్రపంచ వ్యాప్తంగా లైగర్ విడుదల కానుంది. ఈ మూవీలో ప్రపంచ బాక్సింగ్ దిగ్గజం, వరల్డ్ మాజీ చాంపియన్ మైక్ టైసన్ కీలక పాత్రతో నటిస్తున్న సంగతి తెలిసిందే.