Trolls On Akshay Kumar Wife Twinkle Khanna After Her Shocking Comment's On The Kashmir Files Movie - Sakshi
Sakshi News home page

Twinkle Khanna: ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ పై అక్షయ్‌ భార్య సంచలన వ్యాఖ్యలు

Apr 5 2022 4:58 PM | Updated on Apr 5 2022 6:53 PM

Akshay Kumar Wife, Actress Twinkle Khanna Jokes On The Kashmir File - Sakshi

ఇలాంటి వాళ్లందరు దర్శక-నిర్మాతలని చెప్పుకుంటున్నారు. ఇలాంటి వాళ్లను కూడా దర్శక-నిర్మాతలు అనాలా? అంటూ ట్వింకిల్‌ ఖన్నా వ్యాఖ్యానించింది.

Twinkle Khanna Shocking Comments On The Kashmir Files: చిన్న సినిమాగా వచ్చి పెను సంచలన విజయం సాధించింది ది కశ్మీర్‌ ఫైల్స్‌. మార్చి 11న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది.  కేవలం రూ. 10 కోట్ల నుంచి రూ. 12 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ప్రపంచ్యాప్తంగా రూ. 301 కోట్ల గ్రాస్‌ అందుకుంది. అంతగా ప్రజాదారణ పొందిన కశ్మీర్‌ ఫైల్స్‌ ఎందరో సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఏకంగా ప్రధానీ సైతం స్పందిస్తూ కశ్మీర్‌ ఫైల్స్‌ను కొడియాడారు. అలాంటి సినిమాపై బాలీవుడ్‌ నటి, రైటర్‌ ట్వింకిల్‌ ఖన్నా సంచలన వ్యాఖ్యలు చేసింది. కాగా ట్వింకిల్‌ ఖన్నా బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ భార్య అనే విషయం తెలిసిందే. ఆమె వార్త పత్రికలకు స్పెషల్‌ కాలమ్‌ అర్టికల్స్‌ రాస్తుంటుంది.

చదవండి: వైరల్‌ అవుతున్న రామ్‌ చరణ్‌ షాకింగ్‌ లుక్‌, పంచెకట్టుతో సైకిల్‌పై ఇలా

ఈ నేపథ్యంలో ఇటీవల తను రాసిన ఓ ఆర్టికల్‌లో కశ్మీర్‌ ఫైల్స్‌ గురించి ప్రస్తావించింది. ‘ఓ నిర్మాత ఆఫీసులో సమావేశం సందర్భంగా కశ్మీర్‌ ఫైల్స్‌ గురించి, ఈ మూవీ క్రేజ్‌ గురించి మాట్లాడారు.  కశ్మీర్ ఫైల్స్ స్ఫూర్తితో చాలా మంది ‘అంధేరీ ఫైల్స్’, ‘ఖర్ దందా ఫైల్స్’, ‘సౌత్ బాంబే ఫైల్స్’ వంటి పేర్లను నిర్మాతలు నమోదు చేసుకుంటున్నారని ఆయన చెప్పినట్లు పేర్కొంది. ఇలాంటి వాళ్లందరు దర్శక-నిర్మాతలని చెప్పుకుంటున్నారు. వీరిని కూడా దర్శక-నిర్మాతలు అనాలా? అంటూ మండిపడింది. అలా అయితే తాను కూడా మానిక్యూర్‌(చేతి గోళ్లు, వేళ్లు శుభ్రం చేయడం)పై ఓ సినిమా తీస్తానని, దీనికి ‘నెయిల్‌ ఫైల్స్‌’ అనే టైటిల్‌ పెడతానంటూ అనుచిత వ్యాఖ్యలు చేసింది. అనంతరం తాను ఓ నేషనలిస్ట్ అని చెప్పుకునే మనోజ్ కుమార్ లాగే అందరూ క్లర్కులుగా మారుతారా? అంటూ ఎద్దేవా చేసింది.

చదవండి: ఈ కమర్షియల్‌ యాడ్‌కు చిరు పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

కశ్మీర్‌ ఫైల్స్‌పై ఆమె చేసిన వ్యాఖ్యల పంట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రకారకాల కామెంట్స్‌ చేస్తూ ట్వింకిల్‌ ఖన్నాను ట్రోల్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే కశ్మీర్‌ ఫైల్స్‌పై ఆమె భర్త, హీరో అక్షయ్‌ కుమార్‌ ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. 'వివేక్‌ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన కశ్మీర్‌ ఫైల్స్‌ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. విచిత్రమేంటంటే దీని ఎఫెక్ట్‌ నా సినిమాపై కూడా పడింది. నేను నటించిన బచ్చన్‌ పాండే కలెక్షన్లను కశ్మీర్‌ ఫైల్స్‌ దెబ్బకొట్టింది' అని చెప్పుకొచ్చాడు. వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ మూవీలో 1990లో కశ్మీర్‌ పండిట్లపై జరిగిన ఆకృత్యాలను తెరపై చూపించారు. ఈ  చిత్రంలో ప్రముఖ బాలీవుడ్‌ నటులు అనుపమ ఖేర్, మిథున్ చక్రవర్తి, నటి పల్లవి జోషిలు ప్రధాన పాత్రలు పోషించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement