గొప్ప ప్రయాణం | Akshay Kumar begins shooting for final schedule of Haiwaan | Sakshi
Sakshi News home page

గొప్ప ప్రయాణం

Oct 10 2025 4:05 AM | Updated on Oct 10 2025 4:05 AM

Akshay Kumar begins shooting for final schedule of Haiwaan

బాలీవుడ్‌ హీరోలు అక్షయ్‌ కుమార్, సైఫ్‌ అలీఖాన్‌ 17 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్న చిత్రం ‘హైవాన్‌’. ప్రియదర్శన్‌ దర్శకత్వంలో కేవీఎన్‌ ప్రోడక్ష న్స్, తెస్పియన్‌ ఫిలింస్‌పై వెంకట్‌ కె. నారాయణ, శైలజా దేశాయ్‌ ఫెన్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చివరి షెడ్యూల్‌ షూటింగ్‌లో అక్షయ్‌ కుమార్‌  పాల్గొంటున్నట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది.

‘‘సరికొత్త థ్రిల్లర్‌గా రూ పొందుతోన్న చిత్రం ‘హైవాన్‌’. ఈ మూవీలో ఫస్ట్‌ టైమ్‌ నెగిటివ్‌ క్యారెక్టర్‌ చేస్తున్నారు అక్షయ్‌ కుమార్‌’’ అన్నారు మేకర్స్‌. ఈ సందర్భంగా అక్షయ్‌ కుమార్‌ ఓ స్పెషల్‌ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ‘‘హైవాన్‌’ చిత్రంతో ఒక గొప్ప ప్రయాణం చేస్తున్నాను. ఈ సినిమాలో నేను చేస్తున్న  పాత్ర పలు విధాలుగా నన్ను ఆశ్చర్యపరుస్తోంది. ఇలాంటి రోల్‌లో నటించే అవకాశం కల్పించిన డైరెక్టర్‌ ప్రియదర్శన్‌కు థ్యాంక్స్‌. ఆయన చేస్తున్న మూవీ సెట్‌లో ఉంటే ఇంట్లో ఉన్న అనుభూతి కలుగుతుంది. సైఫ్‌తో కలిసి నటించడాన్ని ఎంజాయ్‌ చేస్తున్నాను’’ అంటూ అక్షయ్‌ తెలి పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement