రెండు దశాబ్దాల తర్వాత..! | After Boys Thaman Returns to Acting After Two Decades | Sakshi
Sakshi News home page

రెండు దశాబ్దాల తర్వాత..!

Feb 16 2025 5:54 AM | Updated on Feb 16 2025 5:54 AM

After Boys Thaman Returns to Acting After Two Decades

రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ యాక్టర్‌గా కెమెరా ముందుకు వస్తున్నారు ఎస్‌. తమన్‌(Thaman). శంకర్‌ దర్శకత్వంలో సిద్ధార్థ్, భరత్, మణికందన్, నకుల్, జెనీలియా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బాయ్స్‌’. 2003లో విడుదలైన ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఆ తర్వాత తమన్‌ యాక్టర్‌గా కొనసాగలేదు.

‘మళ్ళీ మళ్ళీ (2009)’ మూవీతో మ్యూజిక్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ను స్టార్ట్‌ చేసి, ది టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్స్‌లో ఒకరిగా కొనసాగుతున్నారు తమన్‌. ఇప్పుడు మళ్లీ లీడ్‌ యాక్టర్‌గా ఓ సినిమా చేయనున్నారు. అధర్య హీరోగా ఆకాశ్‌ భాస్కరన్‌ స్వీయ దర్శక నిర్మాణంలో ‘ఇదయమ్‌ మురళి’ అనే తమిళ మూవీ రానుంది. ఈ చిత్రంలో ప్రీతీ ముకుందన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ఈ సినిమాలో నట్టి, తమన్, ఎన్‌ఎమ్‌ నిహారిక, ప్రగ్యా, సుధాకర్‌ ఇతర లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్నట్లు తెలిపారు మేకర్స్‌. ఇలా రెండు దశాబ్దాల తర్వాత తమన్‌ మళ్లీ ఓ సినిమాలో లీడ్‌ రోల్‌ చేస్తుండటం కన్ఫార్మ్‌ అయిపోయింది. 2003లో వచ్చిన ‘బాయ్స్‌’లో ఓ లీడ్‌ రోల్‌లో నటించిన తమన్‌ ఆ తర్వాత అప్పుడప్పుడు కొన్ని చిత్రాల్లో గెస్ట్‌ రోల్స్‌లో మాత్రమే నటించారు. పూర్తి స్థాయి నటుడిగా తమన్‌ మళ్లీ నటిస్తున్నది ‘ఇదయమ్‌ మురళి’ చిత్రంలోనే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement