Shruti Haasan: శృతిమించిన అవతారం!

Actress Shruti Haasan Glamorous Photos Twitter - Sakshi

లోకనాయకుడు కమలహాసన్‌ వారసురాలు శృతిహాసన్‌ అంటే నిర్మొహమాటానికి నిదర్శనం. గ్లామరస్‌కు  చిరునామా అంటారు. ఈ బ్యూటీ ఏం చెప్పినా సంచలనమే. ఏం చేసినా వార్త. వ్యక్తిగతంగానే ఎక్కువగా వార్తల్లో నిలిచే శృతిహాసన్‌ సంగీత దర్శకురాలిగా, నటిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

ఈమె హిందీ, తమిళం, తెలుగు తదితర భాషల్లో నటిస్తూ బహుభాష నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే శృతిహాసన్‌కు తెలుగులోనే మంచి క్రేజ్‌ ఉంది. ప్రస్తుతం తెలుగులో చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణకు జంటగా వీర సింహారెడ్డి ,ప్రభాస్‌తో సలార్‌ అంటూ క్రేజీ చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిలో వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి చిత్రాలు సంక్రాంతి సందర్భంగా ఒకేసారి విడుదలకు సిద్ధం అవుతుండటం విశేషం.

కాగా శృతిహాసన్‌ను చూడ్డానికి ఎవరైనా ఇష్టపడతారు. అలాంటిది ఎవరికి రుచించని గెటప్‌లో శృతిహాసన్‌ తన ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసి అభిమానులకు షాక్‌ ఇచ్చారు. సింపుల్‌ జుట్టుతో కూడిన రోజు. జ్వరం, సైనస్‌ కారణంగా ఉబ్బిన ముఖం. నెలసరి రోజు వంటి వాటిని మీరు ఇష్టపడతారా అంటూ ఆ ఫొటోలకు కారణాలను పేర్కొన్నారు. ఆ ఫొటోలు ఇప్పుడు  సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. దీంతో శృతి ఏమిటీ అవతారం? అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. 

చదవండి: (రెండో పెళ్లికి సిద్ధమవుతున్న మీనా.. వరుడు అతడే?)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top