మీరా మిథున్‌ అరెస్ట్‌, అరెస్టు చేస్తే ఆత్మహత్య చేసుకుంటా..

Actress Meera Mithun Arrest Video Goes Viral - Sakshi

ప్రముఖ నటి, బిగ్‌బాస్‌ ఫేం మీరా మీథున్‌ను చెన్నై క్రైం బ్రాంచ్‌ పోలీసులు శనివారం కేరళలో అరెస్టు చేశారు. ఇటీవల దళితులపై ఆమె అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో మీరాను వెంటనే అరెస్టు చేయాలని నెటిజన్లు డిమాండ్‌ చేశారు. అంతేగాక దళిత-కేంద్రీకృత పార్టీ అయిన విడుదలై చిరుతైగళ్‌ కట్చి పార్టీ ఉప కార్యదర్శి వన్నీయరసు మీరాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మీరా మీథున్‌పై ఏడు సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేసి ఆమెకు సమాన్లు జారీ చేశారు.

దీనిపై పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వచ్చిన వివరణ ఇవ్వాలని మీరాకు పోలీసులు పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. ఈ నోటీసులపై ఆమె స్పందిస్తూ.. పోలీసులు తనను అరెస్ట్ చేయలేరని.. కలలో మాత్రమే అది జరుగుతుందని.. సాధ్యమైతే అరెస్ట్ చేయాలంటూ పోలీసులకు సవాల్ విసురుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేరళలో తలదాచుకున్న ఆమెను నిన్న అదుపులోకి తీసుకున్నారు.

అయితే పోలీసులు అరెస్టు చేసే సమయంలో మీరా మీథున్‌ రచ్చ రచ్చ చేసిన వీడియో సోషల్‌ మీడియా వైరల్‌ అవుతోంది. ఇక్కడ ఆడవాళ్లకు రక్షణ లేదా? పోలీసులు చార్చర్‌ చేస్తున్నారు.. ప్రధాని మోదీ, తమిళనాడు సీఎం స్టాలిన్‌ స్పందించండి’ అంటూ అరుస్తున్న వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. అంతేగాక ప్రతి ఒక్కరు, పోలీసులు నన్ను టార్గెట్ చేస్తున్నారు. నన్ను టచ్ చేస్తే కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకుంటాను అంటూ బెదిరించింది. ముఖ్యమంత్రి, ప్రధాని మోదీ..ఇది తమిళనాడు పోలీసులు చేస్తున్న హింస అంటూ చెప్పుకొచ్చింది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top