Krithi Shetty: పంజాబీ డ్రెస్‌లో ‘బేబమ్మ’హోయలు.. ఫోటోస్‌ వైరల్‌ | Actress Krithi Shetty Latest Photos Goes Viral | Sakshi
Sakshi News home page

Krithi Shetty: బేబమ్మ.. నీ నవ్వు చాలమ్మా.. కృతిశెట్టి బ్యూటిఫుల్‌ ఫోటోస్‌ చూశారా?

Dec 30 2021 12:36 PM | Updated on Apr 14 2022 1:24 PM

Actress Krithi Shetty Latest Photos Goes Viral - Sakshi

టాలీవుడ్‌లో ‘ఉప్పెన’లా దూసుకెళ్తున్న హీరోయిన్‌ కృతిశెట్టి. చూడడానికి అచ్చం తెలుగు అమ్మాయిలా ఉండే ఈ కన్నడ భామ.. ఒకే ఒక్క సినిమాతో స్టార్‌ హీరోయిన్స్‌ జాబితాలో చేరిపోయింది. ‘ఉప్పెన’తర్వాత ఈ భామకి వరుస ఆఫర్స్‌ వచ్చాయి.  

తాజాగా ‘శ్యామ్ సింగరాయ్’లో నానికి జోడిగా నటించి మెప్పించింది. కేవలం అందతోనే కాకుండా.. అభినయంతో కూడా అందర్నీ ఆకట్టుకుంటుంది. 

ఆకర్షించే ఆందంతో పాటు, ఆకట్టుకునే నటనతో తెలుగు ప్రేక్షకులకు తక్కువ సమయంలోనే ఎక్కువ దగ్గరైంది.

తాజాగా ఈ భామకు తనకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది. అందులో ఆమె లుక్, డ్రెస్‌ స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారాయి. 

‘శ్యామ్ సింగరాయ్' సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో కృతిశెట్టి ధరించిన దుస్తులు అందర్ని ఆకట్టుకున్నాయి. కృతిశెట్టి కేవలం పక్కింటి అమ్మాయిగానే కాకుండా మోడరన్ గర్ల్‌గా తనదైన శైలిలో ఆకట్టుకొంటున్నది.

నాగార్జున హీరోగా ‘బంగార్రాజు’ సీక్వెల్‌ లో నాగ చైతన్యకు జోడిగా నటిస్తోంది కృతి. తాజాగా నాగ లక్ష్మిగా విడుదల చేసిన కృతి శెట్టి లుక్ ఆకట్టుకునే విధంగా ఉంది.

నితిన్‌ హీరోగా నటిస్తున్న‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రంలోనూ కృతిశెట్టియే హీరోయిన్‌. 

సుధీర్ బాబు- ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్‌.

రామ్‌ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ద్విభాషా చిత్రంగా తెలుగు మరియు తమిళంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement