విజయ్‌కి నో చెప్పిన యంగ్ హీరోయిన్.. ఎందుకో తెలుసా? | Actress Ivana Says No To Thalapathy Vijay's 'The Goat' Movie | Sakshi
Sakshi News home page

Vijay - Ivana: దళపతి మూవీలో ఛాన్స్ వదులుకున్న ఇవానా.. అదే కారణం!

Feb 21 2024 9:05 AM | Updated on Feb 21 2024 9:50 AM

Actress Ivana No To Thalapathy Vijay The Goat Movie - Sakshi

సాధారణంగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ వస్తే ఎవరైనా మరో ఆలోచన లేకుండా ఒప్పేసుకుంటారు. కొందరు మాత్రం నిరభ్యంతరంగా నో చెప్పేస్తుంటారు. తమిళ బ్యూటీ ఇవానా కూడా అలానే దళపతి విజయ్ మూవీకి నో చెప్పేసిందట. ఇప్పుడు ఈ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిపోయింది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్‌స్టార్ సినిమా.. అనుకున్న టైమ్ కంటే ముందే!)

దళపతి విజయ్ ప్రస్తుతం 'ద గోట్' (The GOAT) అనే సినిమా చేస్తున్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తీస్తున్న ఈ చిత్రంలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. తండ్రికి జరిగిన అన్యాయాన్ని టైమ్ ట్రావెల్ చేసి, హీరో ఎలా తీర్చుకుంటాడనే కథతో ఈ సినిమా తీస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇదే మూవీలో విజయ్‌తో పాటు ప్రభుదేవా, అజ్మల్, ప్రశాంత్ తదితరులు కీలక పాత్రలు పోషస్తున్నారు. విజయ్ చెల్లి పాత్ర కోసం 'లవ్ టుడే' ఫేమ్ హీరోయిన్ ఇవానాని అడిగారట. చెల్లి పాత్ర చేస్తే తనకు హీరోయిన్‌గా ఛాన్సులు తగ్గే ప్రమాదముందని, అందుకే నో చెప్పినట్లు ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. ఫలితంగా ఈమెకు బదులు నటి-మోడల్ అభియుక్తని ఆ పాత్ర కోసం ఎంపిక చేశారట.

(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' వాసంతి.. కుర్రాడు ఎవరంటే?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement