 
													Actor Karthikeya Visits Tirupati With Wife And Family: హీరో కార్తికేయ ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. తన ప్రియురాలు లోహితా రెడ్డిని పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. శుక్రవారం(నవంబర్26)న నూతన దంపతులిద్దరూ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో కార్తికేయ దంపతులు శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం వేదపండితుల ఆశీర్వాదం పొందారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందుకున్న ఈ జంటను టీటీడీ ఆలయ అధికారులు సత్కరించారు.


 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
