Vallabhaneni Janardhan Death: టాలీవుడ్‌ మరో విషాదం, ‘గ్యాంగ్‌ లీడర్‌’ నటుడు హఠాన్మరణం

Actor, Director Vallabhaneni Janardhan Passed Away Due to Health Issues - Sakshi

టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. లెజెండరి నటులు కైకాల సత్యనారాయణ, నటుడు చలపతి రావు మృతి మరువకముందే మరో నటుడు కన్నుమూశారు. ప్రముఖ నటుడు, దర్శక-నిర్మాత వల్లభనేని జనార్ధన్(63) అనారోగ్యంతో మృతి చెందారు. ఈ రోజు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో టాలీవుడ్‌లో మరోసారి విషాదం నెలకొంది. 

ఆయన మృతికి టాలీవుడ్‌ సినీ ప్రముఖులు, నటీనటులు సంతాపం తెలియజేస్తున్నారు. కాగా దాదాపు 100కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన మెగాస్టార్‌ చిరంజీవి గ్యాంగ్‌ లీడర్‌ సినిమాతో విలన్‌గా ఎంట్రీ ఇచ్చారు. చిరంజీవితో అనేక చిత్రాల్లో నటించిన జనార్ధన్, బాలకృష్ణతో ‘లక్ష్మీనరసింహా’, నాగార్జునతో ‘వారసుడు’, వెంకటేశ్ తో ‘సూర్య ఐపీఎస్‌’ వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. సినిమాల్లోనే కాకుండా ‘అన్వేషిత’ వంటి సీరియల్స్‌లో నటించి మెప్పించారు జనార్ధన్. 

ప్రముఖ దర్శక నిర్మాత విజయబాపినీడు మూడవ కూతురు లళినీ చౌదరిని జనార్ధన్ వివాహమాడారు. ఆయనకు ఇద్దరు కూతుర్లు, ఓ కొడుకు ఉన్నారు. మొదటి అమ్మాయి శ్వేత చిన్నతనంలోనే చనిపోయింది. రెండో కూతురు అభినయ ఫ్యాషన్ డిజైనర్‌గా కొనసాగుతున్నారు. అబ్బాయి అవినాశ్ అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఇక మామ దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్‌ లీడర్‌ చిత్రంతోనే వల్లభనేని జనార్ధన్ సినీరంగ ప్రవేశం చేశారు. 

చదవండి: 
విషాదంలో రకుల్‌.. మిస్‌ యూ అంటూ ఎమోషనల్‌ పోస్ట్‌

మరో కొత్త వివాదంలో రష్మిక, ఈసారి దక్షిణాదిపై సంచలన వ్యాఖ్యలు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top