Aamir Khan: ఎంత బిజీగా ఉన్నా నా ఇద్దరు మాజీ భార్యలను తప్పకుండా కలుస్తా..

Aamir Khan Reveals He Meets Ex wives Kiran Rao, Reena Dutta at least Once a Week - Sakshi

వేడి వేడి పొగలు కక్కే కాఫీ అంటే చాలామందికి ఇష్టం. అలాగే వాడివేడి ప్రశ్నలతో సెలబ్రిటీలను ఉక్కిరిబిక్కిరి చేసే కాఫీ విత్‌ కరణ్‌ షో అంటే కూడా ఇష్టపడేవారు ఎందరో! అందుకే ఆరు సీజన్లు విజయవంతంగా పూర్తిగా చేసుకుంది కాఫీ విత్‌ కరణ్‌. ప్రస్తుతం ఏడో సీజన్‌ సక్సెస్‌ఫుల్‌గా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ హాట్‌స్టార్‌లో రన్‌ అవుతోంది. ఈసారి ఈ షోకి లాల్‌ సింగ్‌ చద్దా టీం ఆమిర్‌ ఖాన్‌, కరీనా కపూర్‌ వచ్చారు. వారికి గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెప్పిన కరణ్‌.. వారిని నవ్విస్తూనే మరోపక్క సీక్రెట్స్‌ గుట్టు లాగాడు. 

ఈ సందర్భంగా ఆమిర్‌ మాట్లాడుతూ.. 'తన రిలేషన్‌షిప్‌లో ప్రేమ, గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవడం ఉన్నాయే తప్ప క్రూరమైన క్షణాలంటూ ఏమీ లేవు. నా మాజీ భార్యలిద్దరి మీద నాకెంతో గౌరవం ఉంది. ఇప్పటికీ మేమంతా ఓ కుటుంబంలా ఉంటాము. మేము ఎంత బిజీగా ఉన్నా వారానికోసారైనా తప్పకుండా అందరం కలుసుకుంటాం. మామధ్య కేరింగ్‌, ప్రేమాభిమానాలు అలాగే ఉన్నాయి' అని చెప్పుకొచ్చాడు.

కాగా ఆమిర్‌- రీనా 1986 ఏప్రిల్‌ 18న ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. 16 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత వీరిద్దరూ విడిపోయారు. 2002లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత దర్శకనిర్మాత కిరణ్‌రావును ప్రేమించాడు ఆమిర్‌. 2005లో వీరు పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ దంపతులకు ఐవీఎఫ్‌ పద్ధతి ద్వారా ఆజాద్‌ రావు ఖాన్‌ జన్మించాడు. 2021లో వీరు కూడా విడాకులు తీసుకున్నారు.

చదవండి: భర్తకు పాదపూజ చేసిన హీరోయిన్‌పై ట్రోలింగ్‌, ప్రణీత ఏమందంటే?
నటితో అమర్‌దీప్‌ నిశ్చితార్థం, వీడియో వైరల్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top