ఆ సీన్‌లో ఆడ ఏనుగులనే ఎందుకు వాడారో తెలుసా?

13 Years Of Jodha Akbar, Sunita Gowariker Shares Interesting Facts - Sakshi

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్‌, మాజీ  విశ్వసుందరి ఐశ్వర్యరాయ్‌ల పీరియాడికల్‌ డ్రామా మూవీ ‘జోదా అక్బ‌ర్’ ‌విడుదలై నిన్నటికి 13 ఏళ్లు. నిర్మాత అశుతోష్ గోవరికర్‌ నిర్మించిన ఈ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచింది. హృతిక్‌, ఐశ్వర్యరాయ్‌లకు ఈ సినిమా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇందులో హృతిక్‌, ఐశ్యర్యల నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరల్లేదు.

మొఘల్‌ కాలంలోని జోధా అక్భర్‌ల నిజమైన ప్రేమకథా ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం భారతీయ చిత్రపరిశ్రమలో ఓ మైలురాయిగా నిలిచింది. ఈ చిత్రంలోని సన్నివేశంలో డైరక్టర్‌ భారీ సంఖ్యలో ఏనుగులను ఉపయోగించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ షూటింగ్‌ కోసం నిర్మాత అశుతోష్ గోవరికర్‌ కేవలం వంద ఆడ ఏనుగులు మాత్రమే కావాలని చెప్పినట్లు ఈ సందర్భంగా సహా నిర్మాత సునీత గౌవరికర్‌ తెలిపారు. 

ఓ పాత వీడియోను ఆమె షేర్‌ చేస్తూ.. నిర్మాత అశుతోష్‌ ఈ మూవీలో ఉపయోగించే ఏనుగులు కేవలం ఆడవే అయ్యిండాలని చెప్పారు. ఇందుకు ఆయనకు వంద ఆడ ఏనుగులు కావాలని డిమాండ్‌ చేసినట్లు ఈ వీడియోలో ఆమె చెప్పుకొచ్చారు. అయితే అశుతోష్‌ నిర్ణయం విని ఆమె షాకయ్యానన్నారు. వెంటనే వంద ఆడ ఏనుగులే  కావాలంటున్నారని ఆయను అడగడంతో ఆయన చెప్పిన సమాధానికి ఆశ్చర్యపోయానని చెప్పారు. దీనికి ఆయన మగ ఏనుగులు తొందరగా కోపానికి లోనవుతాయి. వాటివల్ల షూటింగ్‌లోని ప్రజలందరికి ప్రమాదం ఉండోచ్చని, అందుకే కేవలం 100 ఆడ ఏనుగులతోనే షూటింగ్‌ చేయాలనుకున్నట్లు ఆయన సమాధానం ఇచ్చారన్నారు.

అంతేగాక ఆ ఏనుగులు అన్ని కూడా ఒకే పరిమాణంలో ఉండాలని తనతో చెప్పారన్నారు. షూటింగ్‌లో ఆయన వాటిని ఆ పేరు కూడా పెట్టారని వాటిన ఆ పేరుతోనే పిలిచేవారని పేర్కొన్నారు. అయితే ఆయన ప్రతి విషయంలో ఆశుతోష్‌ పర్‌ఫక్ట్‌గా ఉంటారడానికి ఈ సంఘటన మరోసారి రుజువు చెసిందని ఆమె చెప్పుకొచ్చారు. అలాగే హీరో హృతిక్‌ రోషన్‌ కూడా మూవీ కొన్ని సన్నివేశాలను షేర్‌ చేస్తూ ఈ చిత్రం సమయంలోని జ్ఞపకాలను గుర్తు చేసుకున్నారు. ‘ఓ వ్యక్తి ఈ చిత్రం నటించడమంటే సాధారణ విషయం కాదు. మొదట ఆశుతోష్‌‌ నాతో ఈ మూవీ గురించి చెప్పినప్పడు బయపడ్డాను. నాతో పాటు ఓ  వెయ్యి మంది సైనికులను ఆయన ఎలా నడిపించగలడు అనుకున్న. చివరికి ఆయన చేశారు’ అంటూ హృతిక్‌ రాసుకొచ్చారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top