కలెక్టర్ ప్రతిమాసింగ్
మెదక్ కలెక్టరేట్: ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు నాణ్యమైన విద్యనందించాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ సిబ్బందికి సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలో విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పిల్లల తల్లిదండ్రుల సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలోని 21 భవిత కేంద్రాల్లో 194 మంది ప్రత్యేక అవసరాలు గల పిల్లలు విద్యను అభ్యసిస్తున్నట్లు చెప్పారు. అలిమ్‌కో అలిమ్‌కో క్యాంపుల ద్వారా అవసరమైన ఉపకరణాలను అందిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డీఈఓ రాజు, ఏఎంఓ సుదర్శన్ మూర్తి, సీఎంఓ రాజు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ శ్రీనివాస్‌రావు
శివ్వంపేట(నర్సాపూర్): కేసుల పురోగతికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సిబ్బందికి సూచించారు. గురువారం శివ్వంపేట పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతిపై ఆరా తీశారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మహిళలు, బాలికలపై జరిగే నేరాలకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తును నిర్ణీత గడువులోగా పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలన్నారు. పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆయన వెంట తూప్రాన్ సీఐ వెంకటరాజా గౌడ్, ఎస్సై మధుకర్‌రెడ్డి, సిబ్బంది ఉన్నారు.
కౌడిపల్లి(నర్సాపూర్): వీబీజీరాంజీ పనులతో గ్రామాల్లో అభివృద్ధికి నిధులు ఎక్కువగా మంజూరవుతాయని డీఆర్‌డీఓ పీడీ శ్రీనివాస్ అన్నారు. గురువారం మండలంలోని రాజిపేటలో ఫాంపాండ్ నిర్మాణ పనులతో పాటు వెంకట్రావుపేటలో ఆసరా పింఛన్ల దరఖాస్తుల వెరిఫికేషన్ చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జలసిరి కింద చేపట్టే పనులు వేగవంతం చేయాలన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ శ్రీనివాస్, సర్పంచ్‌లు దుర్గమ్మ, నాగభూషణం, కుత్‌బొద్దీన్, ఏపీఓ పుణ్యదాస్, ఫీల్డ్ అసిస్టెంట్ గంగరాంగౌడ్, పంచాయతీ కార్యదర్శి ఇట్యనాయక్, నిర్మల, ఉపసర్పంచ్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
వెల్దుర్తి(తూప్రాన్): మండలంలోని హస్తాల్‌పూర్ పంచాయతీ టీబీ రహిత గ్రామంగా గుర్తింపు పొందింది. గ్రామంలో ఒక్క టీబీ (క్షయ) పేషెంట్ కూడా లేకపోవడంతో కలెక్టర్‌లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ చేతులమీదుగా సర్పంచ్ నర్సింహారెడ్డి ప్రశాంసపత్రం అందుకున్నారు. గ్రా మంలో టీబీ నివారణకు తీసుకున్న చర్యలు, ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించడం ఫలితంగా ఈ ఘనత సాధించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
కౌడిపల్లి(నర్సాపూర్): 33 కేవీ లైన్ మరమ్మతుల నేపథ్యంలో శుక్రవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏఈ సాయికుమార్ తెలిపారు. మండలంలోని మహమ్మద్‌నగర్, వెంకట్రావ్‌పేట, రాజిపేట, సలాబత్‌పూర్ సబ్‌స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో శుక్రవారం ఉదయం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్‌కు అంతరాయం ఉంటుందన్నారు.


