● అదనంగా 50 శాతం చార్జీలు!
● ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
సంగారెడ్డి టౌన్: బతుకమ్మ, దసరా పండుగ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. అందులో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా 415 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ఈనెల 10 నుంచి 22వ తేదీ వరకు సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. శనివారం నుంచి పాఠశాలలకు సెలవులు ఉండడంతో ప్రజలు సొంతూరు బాట పట్టనున్నారు. బస్సుల సంఖ్య పెంచడంతో కొంత మేర ప్రయాణికులకు ఇబ్బందులు తప్పనున్నాయి. ప్రతి రోజు 606 బస్సులు తిరుగుతుండగా.. దసరా నేపథ్యంలో అదనంగా 13 రోజుల పాటు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. అదనపు బస్సులకు 50 శాతం చార్జీలు పెంచే అవకాశాలు ఉన్నాయి.
ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా బతుకమ్మ, దసరా సందర్భంగా 415 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశాం. ప్రతి బస్టాండులో అదనపు సిబ్బందితో పర్యవేక్షిస్తాం. అవసరాన్ని బట్టి బస్సులు పెంచుతాం. ప్రత్యేక బస్సులలో అదనపు చార్జీలు ఉంటాయి. గ్రామాలకు వెళ్లడానికి ప్రత్యేకంగా బస్సులు అవసరం ఉన్నా కూడా ఏర్పాటు చేస్తాం. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి.
– విజయ్‌భాస్కర్, ఆర్ఎం


