కాంగ్రెస్‌ పాలనలో కరెంట్‌ కష్టాలు | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ పాలనలో కరెంట్‌ కష్టాలు

Oct 9 2026 6:48 AM | Updated on Oct 9 2026 6:48 AM

నిజాంపేట(మెదక్‌): విద్యుత్‌ సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం పంటలు పొట్ట దశలో ఉన్నాయని, ఈ సమయంలో సాగునీరు అందకపోతే ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. కనీసం 15 రోజుల పాటు 12 గంటల విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం 24 గంటల విద్యుత్‌ ఇస్తామని హామీ ఇచ్చినా, ప్రస్తుతం ఆరు నుంచి ఏడు గంటలు కూడా సక్రమంగా సరఫరా కావడం లేదని ఆరోపించారు. రైతులకు విద్యుత్‌ సమస్య వస్తే స్థానిక ఎమ్మెల్యే, అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించకపోతే రైతుల పక్షాన అందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, రైతులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement