ఎల్‌నినోతో వర్షాల జాడ లేకపోవడంతో చి‘వరి’ తడికి నీరందించేందుకు మంజీరా పరీవాహక ప్రాంతాల రైతులు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. నదిలో అక్కడక్కడా నీరు ఉన్న మడుగుల్లో పెద్ద ఎత్తున మోటార్లు ఏర్పాటు చేసి పంటలకు నీరందిస్తున్నారు. ఇసుక తిన్నెల కింద ఉన్న నీటిని పైకి తెచ్చేందుకు పెద్దఎత్తున గుంతలు తవ్వుతున్నారు. ఉన్న కొద్దిపాటి నీటిని తమ పొలాలకు పారిస్తున్నారు. ఇక బోరు బావులు ఉన్న రైతులు పంట చేతికొస్తుందన్న ధీమాతో ఉన్నారు.
– కొల్చారం(నర్సాపూర్)


