న్యూస్‌రీల్
ఎస్‌ఐఆర్–2002 జాబితాలో పేరు లేని వ్యక్తులు రెండు బాక్సులు వదిలేసి, మూడో బాక్స్ నింపాలి. ఇది తెలియక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు.
చాలా మంది ఓటర్ల అడ్రస్, పోలింగ్ బూత్ కేంద్రాలు, నంబర్లు మారాయి. అప్పటి వివరాలు అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్నారు.
నిరక్షరాస్యులైన ఓటర్లకు బీఎల్‌ఓలు సహా యం చేయాల్సి ఉండగా, వారికి సరైన అవగాహన లేక ఫారాలు ఇచ్చేసి వెళ్తున్నారు. టీ చర్లకు బాధ్యతలు అప్పగిస్తే సరైన ఫలితాలు వచ్చి ఉండేవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కొన్ని చోట్ల రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరిస్తున్నా, తమ పార్టీ అనుకున్న వారికే సాయం చేస్తున్నారు.
ఆన్‌లైన్‌లో వివరాలు తీసుకుందామంటే, పేర్లలో ఏ మాత్రం తేడా ఉన్నా, అవి కనిపించడం లేదు.
వలస వెళ్లిన వారికి ఫారాలు పంపిణీ కావడం లేదు. రోజువారీ కూలీలుగా పని చేసే వారు ఇళ్లకు రావాలంటే పూట సాగని పరిస్థితి.
వరినాట్లు ఊపందుకున్న వేళ రైతులు పొలాల్లో ఉంటున్నారు. దీంతో ఫారాల పంపిణీ, వాటి నమోదు ఆలస్యమవుతుంది.
ఎన్యూమరేషన్ ఫాంలోని పై రెండు భాగాలు నింపకుంటే, జూలై 31 నుంచి నోటీసులు వస్తాయి. ఆ సమయంలో ఎన్నికల సంఘం సూచించిన ధ్రువపత్రాలు సమర్పించాలి. లేకుంటే ఓటు హక్కు కోల్పోతారు.
24 వరకే ఫారాలు ఇవ్వాలని ఆదేశం
అందుబాటులో లేని 2002 ఎస్‌ఐఆర్‌లు
అందరికీ చేరని ఎన్యూమరేషన్ పత్రాలు
నిర్లక్ష్యం వహిస్తున్న బీఎల్‌ఓలు
మెదక్ అర్బన్: ప్రస్తుతం ఏ పల్లెలో చూసినా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) లొల్లి నడుస్తుంది. శిక్షణ పొందిన బీఎల్‌ఓలు కాకుండా, ఇతర పంచాయతీ సిబ్బంది ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తున్నారు. దీంతో కొంతమందికి అవగాహన లేక ఫారాలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. కాగా, ఎన్యూమరేషన్ ఫాంల గడువు ఈనెల 24 వరకు మాత్రమే ఉండటంతో గ్రామీణ ఓటర్లలో ఆందోళన నెలకొంటుంది.
అవగాహన కరువు
ఎన్యూమరేషన్ ఫాంలో మూడు భాగాలుంటాయి. 2002 ఓటర్ లిస్టులో పేరు నమోదై ఉంటే, మొదటి భాగంలో వివరాలు రాయాలి. లేకపోతే రెండో భాగం నింపాలి. అయితే మొదటి భాగంలో ఓటరు పేరు, గుర్తింపు కార్డు నంబర్, నియోజకవర్గం సంఖ్య, భాగం సంఖ్య, క్రమ సంఖ్య చాలా మందికి తెలియడం లేదు. అప్పటి ఓటర్ లిస్టు చాలా మందికి అందుబాటులో సైతం లేదు.
జిల్లాలో ఇలా..
నియోజకవర్గాలు మెదక్, నర్సాపూర్
మొత్తం ఓటర్లు 4,53,140
బీఎల్‌ఓలు 586
ఇప్పటివరకు ఎన్యూమరేషన్
పత్రాలు అందినవి 4,45,360
డిజిటలైజ్ అయినవి 82,454


