సీ్త్రనిధి.. అతివల పెన్నిధి | - | Sakshi
Sakshi News home page

సీ్త్రనిధి.. అతివల పెన్నిధి

Jul 10 2026 7:28 AM | Updated on Jul 10 2026 7:28 AM

నాలుగేళ్లలో రూ.281.7 కోట్ల రుణాలు పలు వ్యాపారాల్లో మహిళల రాణింపు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు

జిల్లావ్యాప్తంగా 17,059 స్వయం సహాయక గ్రూపులు (ఎస్‌హెచ్‌జీ) సంఘాలు ఉండగా 1.70 లక్షల మంది సభ్యులు ఉన్నారు. సీ్త్రనిధి పథకం ప్రారంభమై 15 ఏళ్లు కావొస్తుండగా, వేలాది మంది మహిళలు రుణాలు తీసుకుని చిరు వ్యాపారాల్లో రాణిస్తున్నారు. గడిచిన నాలుగేళ్లలో జిల్లాకు రూ. 316.43 కోట్ల రుణాలు లక్ష్యంగా విధించగా, రూ.281.7 కోట్లు పొందారు. ఇందులో ఒక్కో సభ్యురాలు రూ. 50 వేల నుంచి రూ.5 లక్షల వరకు రుణాలు పొందే వెసులుబాటు కల్పించారు. వడ్డీ కేవలం రూ.92 పైసలు కావటంతో పోటీ పడి రుణాలు తీసుకుంటున్నారు. వాటితో కిరాణం, పాడి గేదెల కొనుగోలు, లేడీస్‌ ఎంపోరియం, టైలరింగ్‌, ఫ్యాన్సీ స్టోర్ల ఏర్పాటు, ఎలక్ట్రిక్‌ ఆటోలు తదితర వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అలాగే స్వయం సహాయక సంఘాల సభ్యుల కోసం ప్రభుత్వం 2024 నుంచి మూడు రకాల బీమా పథకాలను ప్రత్యేకంగా ప్రవేశపెట్టింది. సీ్త్రనిధి సురక్ష బీమా, లోన్‌బీమా, ప్రమాద బీమాతో వారి కుటుంబాలను ఆదుకోవడంతో పాటు రుణ విముక్తి కల్పిస్తున్నారు.

వీఓఏల చేతివాటం!

జిల్లాలో స్వయం సహాయక సంఘాల సభ్యులు సీ్త్రనిధి ద్వారా రుణాలు పొంది వ్యాపారాల్లో రాణిస్తుంటే కొందరు వీఓఏలు చేతివాటం ప్రదర్శిస్తూ మహిళలకు ఇబ్బందులకు గురుచేస్తున్నారు. కిస్తీల రూపంలో చెల్లించిన డబ్బులను బ్యాంకుల్లో జమ చేయాల్సి ఉండగా, కొంతమంది వారి సొంతానికి వాడుకుంటున్నారు. గడిచిన నాలుగేళ్లలో 24 మంది వీఓఏలు రూ. 64.67 లక్షలు వాడుకున్నట్లు ఆడిట్‌ ద్వారా బయట పడింది. వారి నుంచి ఇప్పటివరకు రూ. 26.31 లక్షలు రికవరీ చేశారు. 13 మందిని తొలగించారు.

సీ్త్రనిధి పథకం మహిళల ఆర్థికాభివృద్ధికి

కొండంత అండగా నిలుస్తోంది. వ్యక్తిగత రుణాలు పొంది చిరు వ్యాపారాలు చేసుకుంటూ స్వయం సమృద్ధి సాధిస్తున్నారు. గడిచిన నాలుగేళ్లలో రూ.281.7 కోట్ల రుణాలు పొంది ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నారు. – మెదక్‌జోన్‌

పథకానికి ఎంతో ఆదరణ

ఎస్‌హెచ్‌జీ సభ్యులకు సీ్త్రనిధి కొండంత అండగా నిలుస్తోంది. ఏటా రూ. కోట్లాది రుణాలు పొందుతూ స్వయంగా వ్యాపా రాలు చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నా రు. దీంతో ఈ పథకం ఎంతో ఆదరణ పొందు తుంది. – గంగారాం, సీ్త్రనిధి ఆర్‌ఎం

జిల్లాలో ఇలా..

సంవత్సరం టార్గెట్‌ ఇచ్చిన రుణం

(రూ. కోట్లలో)

2022 110.55 75.19

2023 60.57 62.45

2024 66.54 64.95

2025 78.77 79.11

2026 (3 నెలల్లో) 93.00 11.60

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement