ఆదాయం పెంచుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఆదాయం పెంచుకోవాలి

Jul 10 2026 7:28 AM | Updated on Jul 10 2026 7:28 AM

● ఆదర్శ గ్రామాలుగా ఎదగాలి ● కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌

● ఆదర్శ గ్రామాలుగా ఎదగాలి ● కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌

మెదక్‌ కలెక్టరేట్‌: గ్రామ పంచాయతీలు ఆదాయ వనరులు పెంచుకొని అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతూ ఆదర్శ గ్రామాలుగా ఎదగాలని కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో మెదక్‌ నియోజకవర్గ సర్పంచ్‌లు, కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న నిధులతో గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయా లని సూచించారు. ఇప్పటివరకు మంజూరైన నిధులతో అసంపూర్తి పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నా రు. అనంతరం పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, ఉపాధి హామీ తదితర అంశాలపై కలెక్టర్‌ సమీక్షించారు. పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా జరిగిన జిల్లా పోషణ కమిటీ సమావేశంలో కలెక్టర్‌ పాల్గొన్నారు. మెదక్‌ను పోషకాహార లోపం లేని జిల్లాగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. అనంతరం ఎల్‌ని నో ప్రభావంపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇతర మంత్రులు, సీఎస్‌ సంజయ్‌జాజు, రెవెన్యూ శాఖ రాష్ట్ర కార్యదర్శి డీఎస్‌ లోకేష్‌కుమార్‌లు వేర్వేరుగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement