చేగుంట(తూప్రాన్): రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో గుడిసెల్లో ఉన్న వారికే మొదటి ప్రాధాన్యం కల్పించామని హౌసింగ్ పీడీ మాణిక్యం తెలిపారు. గురువారం చేగుంటలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి మాట్లాడారు. గ్రామాల్లో గుడిసెల్లో నివాసం ఉంటున్న కుటుంబాల వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. మండలంలో 111 మంది లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. లబ్ధిదారులకు వెంటనే డబ్బులు అందిస్తున్నట్లు వి వరించారు. అనంతరం లబ్ధిదారులకు నిర్మాణ విషయంలో పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఈఈ యాదగిరి, ఏఈ రియాజొద్దీన్, కార్యదర్శి వెంకటేశ్ ఉన్నారు.


