మెదక్‌జోన్: 3వ జోనల్ పోలీస్ డ్యూటీ మీట్‌లో మెదక్‌కు పతకాలు రావటం గర్వంగా ఉందని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. కరీంనగర్‌లో ఈనెల 7, 8 తేదీల్లో నిర్వహించిన పోలీస్ డ్యూటీ మీట్‌లో జిల్లా పోలీసులు 8 పతకాలు సాధించగా, గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో విజేతలను ఆయన అభినందించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడు తూ.. సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు పెంచుకుంటూ రాష్ట్రస్థాయి పోటీల్లోనూ జిల్లా ప్రతిష్టను నిలబెట్టారని కొనియాడారు. ట్రాకింగ్ విభాగంలో మహేశ్, నార్కోటిక్స్‌లో శ్రావణ్, యా క్సెస్ కంట్రోల్, కంప్యూటర్ అవేర్‌నెస్, ఆఫీస్ ఆటోమేషన్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ విభాగాల్లో సతీశ్ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించినట్లు తెలిపారు. అలాగే పోలీస్ వీడియో, ఫొటోగ్రఫీ విభాగంలో శ్రీధర్ విజేత గా నిలిచారన్నారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించాలని సూచించారు.
టీచర్ల సమస్యలు
పరిష్కరించండి
నర్సాపూర్: ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పీఆర్టీ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి సామ్యానాయక్ డిమాండ్ చేశారు. గురువారం నర్సాపూర్‌తో పాటు మండలంలోని కాగజ్‌మద్దూర్, రెడ్డిపల్లి, పెద్దచింతకుంట తదితర పాఠశాలల్లో సభ్యత్వ నమోదు చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న పీఆర్సీని ప్రకటించి అమలు చేయాలన్నారు. కొత్త ఆరోగ్య పథకం ద్వారా రాష్ట్రంలోని అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యం అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కొత్త పెన్షన్ స్కీంను రద్దు చేసి పాత పెన్షన్ పథకాన్ని అమలు చేయాలన్నారు. కా ర్యక్రమంలో యూనియన్ నాయకులు శ్రీజ్యోతి, భీమ్లా నాయక్, వీరేశం, శ్రీకాంత్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
వెల్దుర్తి(తూప్రాన్): మండలంలోని హస్తాల్‌పూర్, ఎం.జలాల్‌పూర్, మహ్మద్‌నగర్ తండాలో అంగన్‌వాడీ టీచర్, శంశిరెడ్డిపల్లి తండాలో అంగన్‌వాడీ హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఐసీడీఎస్ సూపర్‌వైజర్ మాధవి తెలిపారు. ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
విద్యారంగ సమస్యలపై
ఉద్యమిస్తాం: ఏబీవీపీ
రామాయంపేట(మెదక్): విద్యారంగ సమస్యలపై ఉద్యమిస్తామని ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు బండారి ప్రశాంత్ అన్నారు. సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం రామాయంపేటలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులతో కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం వివేకాంద విగ్రహం వద్ద జెండాను ఎగురవేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యలతో పాటు విపత్తుల సమయంలో ప్రజలను ఆదుకోవడానికి ఎల్లవేళలా మందుంటామన్నారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు హరిసింగ్, నవీన్, అరవింద్, ధనరాజ్ పాల్గొన్నారు.
‘అంత్యోదయ కార్డుల
రద్దు సరికాదు’
మెదక్ కలెక్టరేట్: ఆహార భద్రత పథకంలో అంత్యోదయ కార్డు రద్దును వెంటనే విరమించుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని హెడ్ పోస్టాఫీస్ వద్ద సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆహార భద్రత చట్టం ప్రకారం పేదలకు అన్నం పెట్టాలని చ ట్టంలో ఉందన్నారు.


