చెరుకు క్రషింగ్‌పై నీలినీడలు
● బురదమయంగా పంట పొలాలు ● గోదావరి–గంగా, గణపతి ఫ్యాక్టరీల్లో 5, 7 తేదీల్లో ముహూర్తం
జహీరాబాద్: మొన్నటివరకు భారీ వర్షాలు కురవడంతో ఈ ఏడాది చెరుకు క్రషింగ్ సకాలంలో జరుగుతుందో లేదోననే అనుమానాలు మొదలయ్యా యి. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల 15రోజుల నుంచి 20 రోజుల వరకు పొలాల్లోకి వా హనాలు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. లోతట్టు ప్రాంతాల్లో అయితే నెల రోజుల అయినా పొలాల్లోకి వా హనాలు, చెరకు కోత యంత్రాలు వెళ్లలేని పరిస్థితి నెలకొందంటున్నారు. దీంతో అనుకున్న సమాయానికి క్రషింగ్ జరపడం సాధ్యం కాదని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
క్రషింగ్‌కు సిద్ధమైనా...
జిల్లాలోని రాయికోడ్ మండలంలోని మాటూర్ గ్రామంలో గల గోదావరి గంగా, సంగారెడ్డిలోని గణపతి చక్కెర కర్మాగారాలు క్రషింగ్‌ను ప్రారంభించేందుకు పూర్తిస్థాయిలో సిద్ధం చేసి ఉంచారు. మాటూర్‌లోని గోదావరిగంగా కర్మాగారంలో ఈ నెల 5న, సంగారెడ్డిలోని గణపతి కార్మగారంలో 7వ తేదీ నుంచి క్రషింగ్‌ను ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే తుపాను కారణంగా ముందుగా అనుకున్న తేదీల్లో క్రషింగ్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. పక్షం రోజుల వరకు పూర్తిస్థాయిలో క్రషింగ్‌కు అవసరం మేరకు చెరుకు సరఫరా కావడం అనుమానంగానే ఉందని రైతులు చెబుతున్నారు. జిల్లాలో సుమారు 12 లక్షల టన్నుల చెరు కు ఉత్పత్తి కానుంది. ఒక్క జహీరాబాద్ నియోజకవర్గంలోనే 9 లక్షల టన్నుల పంట ఉత్పత్తి కానుందని అధికారులు అంచనా వేస్తున్నారు.


