స్పెషల్ డ్రైవ్‌తో సత్ఫలితాలు
మెదక్ కలెక్టరేట్: భూభారతి దరఖాస్తుల పరిష్కారం కోసం చేపట్టిన పది రోజుల స్పెషల్ డ్రైవ్‌తో సత్ఫలితాలు సాధించామని కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వేగవంతంగా దరఖాస్తులను పరిష్కరించడానికి జిల్లాలో అక్టోబర్ 22 నుంచి ఈనెల 1వ తేదీ వరకు 10 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు తెలిపారు. గడిచిన 10 రోజుల్లో తహసీల్దార్ల పరిధిలో 183, ఆర్డీఓల పరిధిలో 661, కలెక్టర్ స్వయంగా 168 దరఖాస్తులు క్లియర్ చేసినట్లు చెప్పారు. జిల్లాలో మొత్తం 1,012 దరఖాస్తులను శాశ్వతంగా పరిష్కరించినట్లు వివరించారు. ఇదే సమయంలో 1,424 ఫైల్స్ తహసీల్దార్ల వద్ద నుంచి కలెక్టరేట్‌కు చేరుకున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా 1,561 దరఖాస్తులను పై లెవెల్‌కు పంపించామన్నారు. స్పెషల్ డ్రైవ్‌లో మొత్తం 2,573 ఫైల్స్ వివిధ స్థాయిలో పరిష్కరించామని వెల్లడించారు. ఇదే స్ఫూర్తితో మిగితా ఫైళ్లను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈసందర్భంగా జిల్లాలోని రెవెన్యూ సిబ్బందిని కలెక్టర్ అభినందించారు.
కలెక్టర్ రాహుల్‌రాజ్
1,012 భూభారతి దరఖాస్తులకు మోక్షం
పరిష్కారం దిశగా
మరో 1,424 అప్లికేషన్లు


