మల్లన్న క్షేత్రంలో కార్తీక శోభ
కొమురవెల్లి(సిద్దిపేట): ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు ఆదివారం భారీ సంఖ్యలో తరలివచ్చారు. కార్తీక మాసం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. పుష్కరిణిలో స్నానమాచరించి స్వా మి వారిని దర్శించుకున్నారు. పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఉద్యోగులు, అర్చకులు, ఒగ్గుపూజారులు భక్తు లకు సేవలందించారు.
ఆలయ పర్యవేక్షకుడిగా చంద్రశేఖర్
ఆలయ పర్యవేక్షకుడు సురేందర్‌రెడ్డి ఇటీవల బదిలీపై వెళ్లగా, మరో పర్యవేక్షకుడు శుక్రవా రం పదవీ విరమణ పొందారు. దీంతో దేవాదాయ శాఖ కొండగట్టు ఆంజనేయ స్వా మి ఆలయంలో పర్యవేక్షకుడిగా పని చేస్తున్న చంద్రశేఖర్‌ను మల్లన్న ఆలయానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయగా ఆదివారం బాధ్యతలు చేపట్టారు.


