
ఏచూరి ఆశయాలను సాధిస్తాం
మెదక్ కలెక్టరేట్: దివంగత సీపీఎం నేత సీతారాం ఏచూరి ఆశయాలను సాధిస్తామని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి కడారి నర్సమ్మ పేర్కొన్నారు. శుక్రవారం సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సంధర్భంగా మెదక్ కేవల్ కిషన్ భవనంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నర్సమ్మ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ఏచూరి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. ప్రజల హక్కుల కోసం ఏచూరి చేసిన అనేక పోరాటాల స్ఫూర్తితో రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ప్రజలను ఐక్యం చేసి భవిష్యత్‌లో పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మల్లేశం, నాయకులు సంతోష్, వెంకట్, చౌకత్, సత్యం, రాణి, తదితరులు పాల్గొన్నారు.
ఏచూరికి ఘన నివాళి
వెల్దుర్తి(తూప్రాన్): మండల కేంద్రం వెల్దుర్తిలో సీపీఎం ఆధ్వర్యంలో సీతారాం ఏచూరీ మొదటి వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఫొటోకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రపంచ, దేశ రాజకీయాల్లో సీతారాం ఏచూరి ప్రత్యేక ముద్ర వేసుకున్న రాజకీయ నాయకుడిగాను, మంచి పార్లమెంటేరియన్‌గా పేరు పొందారని పలువురు నాయకులు కొనియాడారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గౌరి, సాయిలు, అశోక్, రాజు తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి నర్సమ్మ