
ఇసుక మేటలు తొలగిస్తాం
చిన్నశంకరంపేట(మెదక్): పంట పొలాల్లో వేసిన ఇసుక మేటలను ఉపాధి హామీ పథకం కూలీల ద్వారా తొలగించేందుకు చర్యలు చేపట్టినట్లు నార్సింగి ఎంపీడీఓ ఆనంద్‌కుమార్ తెలిపారు. శుక్రవారం నార్సింగి మండలం జప్తిశివనూర్ గ్రామంలో భారీ వర్షాలతో పంట పొలాల్లో చేరిన ఇసుక మేటలను అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ రైతుల పంట పొలాలను పరిశీలించి కూలీల అవసరాలపై ఒక అంచనాకు రానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈజీఎస్ ఏపీఓ రాజేశ్వర్, ఏఈఓ దివ్య ఉన్నారు.
నార్సింగి ఎంపీడీఓ ఆనంద్‌కుమార్