
పకడ్బందీగా పారిశుద్ధ్య పనులు
తూప్రాన్/చేగుంట/శివ్వంపేట(నర్సాపూర్): వర్షాల నేపథ్యంలో గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు పకడ్బందీగా చేపట్టాలని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో సీజనల్ వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఇందుకోసం శానిటేషన్ పనులు సక్రమంగా జరిగే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఓటరు జాబితా విషయంలో కార్యదర్శులు సమర్థవంతంగా పని చేశారని కొనియడారు. సమావేశంలో ఎంపీడీఓ సతీశ్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. అనంతరం చేగుంట మండలంలోని చందాయిపేటలో ఉపయోగంలో లేని ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనాన్ని పరిశీలించారు. మాసాయిపేట మండలానికి చెందిన కస్తూర్బా పాఠశాల నిర్వహణకు వీలుగా ఉంటుందేమో పరిశీలించాలని పంచాయతీ రాజ్ ఏఈ అభినవ్‌కు సూచించారు. అలాగే చేగుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాలను పరిశీలించి పాఠశాల నిర్వహణ గురించి ఎంఈఓ నీరజను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు శివ్వంపేట ఎంపీడీఓ కార్యాలయాన్ని తనిఖీ చేసి పలు రికార్డులు, ఓటరు తుది జాబితా వివరాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. స్ధానిక సంస్థల ఎన్నికలకు ఎప్పుడైన నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నందున, సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
జెడ్పీ సీఈఓ ఎల్లయ్య